Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తడిసి ముద్దైన తెలంగాణ …గోదావరికి వరద ప్రవాహం !

తెలంగాణ అతలాకుతలం భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం :పెరుగుతున్న గోదావరి
-తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు.. నేడు, రేపు కూడా భారీ వర్షాలు
-ముధోల్ జిల్లాలో రికార్డు స్థాయిలో 20.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
-పదేళ్ల తర్వాత ఇదే రికార్డు
-పొంగుతున్న వాగులు, వంకలు
-రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకరి మృతి
-పలు చోట్ల కోతకు గురైన రోడ్లు
-మరో మూడు రోజుల్లో మరో ఉపరితల ఆవర్తనం
-ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
సహకచర్యలు ముమ్మరం

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయింది .హైదరాబాదులో ప్రజలు బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వివిధ వాగులు వంకలు నదులు విపరీతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అన్ని జిల్లాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా పేదలు నివసిస్తున్నాం కాలనీలు వరదలతో నిండిపోయాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అధికారులు ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలంగాణ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వర్షాల వల్ల కలుగుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ వివిధ జిల్లాల కలెక్టర్లతో వర్షాలపై సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీసుకోవాలి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వారికి ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి నదికి నీటి ప్రహహం పెరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు . జనజీవనం అస్తవ్యస్తమైంది. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నిర్మల్ జిల్లా ముధోల్‌లో నిన్న ఒక్క రోజే 20.3 సెంటీమీటర్ల వాన కురిసింది. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గత పదేళ్లలో ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 19 జులై 2013న రామగుండంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా, ఇప్పుడది తుడుచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

 

 

భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగడంతో భైంసా-బాసర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. ముస్తాబాద్ మండలం మామిడపల్లికి చెందిన రవి చేపలు పట్టేందుకు వెళ్లి మరణించాడు. మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం లేదంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా మారాయి. కొన్ని జిల్లాల్లో చెరువులు మత్తడి పోస్తున్నాయి. రానున్న అయిదు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

 

Related posts

రిషికొండపై నిర్మిస్తున్నది సెక్రటేరియట్ కాదు: వైఎస్సార్‌‌సీపీ ట్వీట్

Ram Narayana

నేనింకా మరణించలేదు… మీకెందుకు అంత తొందర?: లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్

Drukpadam

తెలంగాణ కొత్త సచివాలయం కింద మినీ రిజర్వాయర్!

Drukpadam

Leave a Comment