Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాత్రి నుంచి కొరటాల శివ ఆఫీసు ముందు ‘ఆచార్య’ ఎగ్జిబిటర్ల ధర్నా!

రాత్రి నుంచి కొరటాల శివ ఆఫీసు ముందు ‘ఆచార్య’ ఎగ్జిబిటర్ల ధర్నా!

  • తమకు వచ్చిన రూ. 15 కోట్ల నష్టంలో కొంత పూడ్చాలని డిమాండ్
  • లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్న చేస్తామని హెచ్చరిక
  • చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య 
  • కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా
Exhibitors of Acharya protesting at Koratala Siva office from last night

చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా  కొట్టింది. చిరు, చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. దర్శకుడు కొరటాలకు తొలి ఓటమి రుచి చూపించింది ఈ చిత్రం. అప్పటిదాకా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న శివ ఒక్కసారిగా డీలా పడ్డాడు. ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆచార్య కష్టాలు శివను ఇంకా వదలడం లేదు.

‘ఆచార్య’ సినిమాతో భారీ నష్టాలు చవిచూసిన 25 మంది ఎగ్జిబిటర్లు కొరటాల ఆఫీసు ముందు నిన్న రాత్రి నుంచి బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. సినిమాను కొని తాము రూ. 15 కోట్ల వరకూ నష్టపోయామని ఆ లోటులో ఎంతో కొంత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది.

Related posts

ఇంగ్లండ్‌లో 30 ఏళ్ల తర్వాత అందిన ఉత్తరం..పంపినవారు.. అందుకోవాల్సిన వారు ఇద్దరూ మృతి!

Drukpadam

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు ఓ గుడ్ న్యూస్!

Drukpadam

మోడీ ప్రభుత్వనవి ప్రజావ్యతిరేక విధానాలు …. దేశ వ్యాపిత ప్రతిఘటన తప్పదు :వడ్డే

Drukpadam

Leave a Comment