శ్రీలంకలో కనిపిస్తే కాల్చివేత …సైన్యానికి పూర్తీ అధికారాలు తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే!
శ్రీలంకలో పూర్తిగా అదుపుతప్పిన పరిస్థితులు
ఎమర్జెన్సీని ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే
ప్రధాని నివాసంలోకి దూసుకుపోయిన ఆందోళనకారులు..
శ్రీలంక ప్రజలకు గొటబాయ, విక్రమసింఘేలపై పూర్తిగా నమ్మకం పోయింది: మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య
గొటబాయ, విక్రమసింఘే రాజీనామాలకు డిమాండ్
ఎంతో అందమైన దేశంగా, పర్యాటకుల పాలిట స్వర్గంలా ఒకప్పుడు గుర్తింపు పొందిన శ్రీలంక ఇప్పుడు కల్లోలభరిత దేశంగా నిత్యం నిరసన జ్వాలలతో రగులుతోంది.శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. అక్కడ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రాజ్యమేలుతుందని ప్రజలు తిరుగుబాటు చేశారు . తమకు తిరుగులేదని విర్రవీగిన అధ్యక్షుడు రాజపక్షేని తన్ని తరిమేశారు . ఎవరికీ కనపడకుండా ఆయన కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయి మలేషియా చేరుకున్నారు . అంటుకు కొన్ని నెలల ముందే ప్రధాని సైతం రాజీనామా చేశారు . ఇప్పుడు ప్రధానిగా ఉన్న విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించారు . ఈ నెల 13 తేదీన రాజీనామా చేస్తానని ప్రకటించిన అధ్యక్షుడు పారిపోవడం ప్రజల కోపానికి కారణమైంది.
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో… ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. మరోవైపు విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఆయన కార్యాలయం పైకి ఎక్కి శ్రీలంక జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ నేపథ్యంలో దేశంలో ఆయన ఎమర్జెన్సీని విధించారు. అంతేకాదు, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏది అవసరమైతే అది చేయాలని, అవసరమైతే కనిపించిన వారిని కాల్చిపడేయాలని వారికి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విక్రమసింఘే మాట్లాడుతూ ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెళ్లనివ్వబోనని అన్నారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తాను తప్పుకునే ప్రయత్నం చేయాలని ఆందోళనకారులు చూస్తున్నారని చెప్పారు.
శ్రీలంక అట్టుడుకుతోంది. రావణుడి గడ్డ రావణకాష్ఠంలా రగులుతోంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఆందోళకారుల దెబ్బకు ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఈరోజు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.కాని మాట తప్పారు . ఆయన మలేషియా పారిపోయారు .అందుకు ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.మలేషియా కూడా లంకేయులు అక్కడ ప్రధాని నివాసం ముందు ఆందోళనలు చేపట్టారు .
అయితే, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలను తీవ్రతరం చేశారు. అంతేకాదు, శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు బాష్పవాయుగోళాలను ప్రయోగిస్తున్నాయి. అయినా ఆందోళన కారులు తగ్గడం లేదు. మరోవైపు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
దేశంలో అల్లర్లకు గొటబాయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలే కారణం …సనత్ జయసూర్య
శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితులపై క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య స్పందించారు. జులై 9 తర్వాత దేశంలో చెలరేగిన ఆందోళనలకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలే కారణమని ఆరోపించారు.
వారు తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి మాట తప్పారని, ఇప్పటికీ పదవులను అంటిపెట్టుకునే ఉన్నారని విమర్శించారు. శ్రీలంక ప్రజలకు వారిద్దరిపై పూర్తిగా నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వస్తున్నా వారు ఖాతరు చేయడంలేదని మండిపడ్డారు. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలు నిలిచిపోవాలంటే ఏదైనా మార్గం ఉందంటే అది వారి రాజీనామాలే అని జయసూర్య స్పష్టం చేశారు.
నిరసనలు ఇలాగే కొనసాగాలని ఎవరూ కోరుకోవడంలేదని, పరిస్థితులే ప్రజలను ఆ దిశగా పురిగొల్పుతున్నాయని వివరించారు. దీనికి ఎక్కడో ఓ చోట చరమగీతం పాడాలని, వీలైనంత త్వరగా ప్రశాంత జీవనంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నామని జయసూర్య తెలిపారు.
శ్రీలంకకు అనేక సందర్భాల్లో భారత్ ఎంతో సాయపడిందని, కానీ సాయం చేయాలంటూ భారత్ ను ఎన్నిసార్లు అడగ్గలం? అని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సొంతంగా ఏదైనా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని జయసూర్య అభిప్రాయపడ్డారు.
కేవలం నిరసన కార్యక్రమాలే ప్రసారం చేయాలంటూ.. శ్రీలంక ప్రభుత్వ టీవీ చానల్ స్టూడియోలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు
శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనజ్వాలలు
ప్రధాని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు
తాజాగా రూపావాహిని చానల్లో లైవ్ కు అంతరాయం
లైవ్ ఆపేసిన చానల్ సిబ్బంది
శ్రీలంకలో ప్రజాగ్రహం ఇంకా చల్లారలేదు. ఇవాళ ప్రధాని కార్యాలయంలోకి నిరసనకారులు చొచ్చుకురావడం తెలిసిందే. తాజాగా, ఆందోళనకారులు శ్రీలంక ప్రభుత్వ టీవీ చానల్ రూపావాహిని స్టూడియోలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో లైవ్ వస్తుండగా, వారు అడ్డుకున్నారు. కేవలం తమ నిరసనలకు సంబంధించిన కార్యక్రమాలనే ప్రసారం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. లైవ్ లో తమ బాణీ వినిపించే ప్రయత్నం చేశారు. ఇదంతా లైవ్ లో దర్శనమిచ్చింది.
దాంతో రూపావాహిని చానల్ సిబ్బంది వెంటనే లైవ్ ఆపేసి, ఓ రికార్డెడ్ ప్రోగ్రామ్ ను ప్రసారం చేశారు. కాగా, శ్రీలంక రాజకీయ సంక్షోభంపై స్పీకర్ మహీంద యాపా అభేవర్ధనే స్పందించారు. మాటకు కట్టుబడి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇవాళ రాజీనామా చేస్తారని అభేవర్ధనే వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే నియమితులయ్యారని తెలిపారు.