Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ ,ఆంధ్రా మధ్య పోలవరం చిచ్చు …

తెలంగాణ ,ఆంధ్రా మధ్య పోలవరం చిచ్చు … ఐదూళ్ళు కావాల్సిందేనన్న మంత్రి అజయ్!
-ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్
-పోలవరం ఆనకట్ట వల్ల భద్రాచలం వద్ద నీటి నిల్వ పెరిగిందన్న అజయ్
-పోలవరం ప్రాజక్ట్ డ్యామ్ వల్ల తెలంగాణను ,ప్రత్యేకించి భద్రాచలానికి ఇబ్బంది అన్న మంత్రి
-డ్యామ్ ఎత్తు వల్ల తెలంగాణకు ఇబ్బందేనని వ్యాఖ్య …గతంలోనే తగ్గించాలని -కోరామని వెల్లడి ఐదు గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలన్నదానిపై ఆంధ్రా మంత్రుల ఫైర్
-హైద్రాబాద్ ఇవ్వమంటే ఇస్తారా, భద్రాచలం కావాలంటే కేటాయిస్తారా అంటున్న నేతలు
-పువ్వాడ అజయ్ వర్సెస్ ఆంధ్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం

 

గోదావరికి వచ్చిన వరదలు ఆంధ్రా ,తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాయి. గోదావరి పై కొత్తగా కడుతున్న పోలవరం ఆనకట్టవల్లనే తెలంగాణలోని ప్రత్యేకించి భద్రాచలం , పినపాక నియోజకవర్గాల ప్రజలను కష్టాల్లోకి నెట్టిందనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి. పోలవరం ఎత్తు తగ్గించటంతోపాటు , గతంలో భద్రాచలం మండలంలో ఉన్న ఎటపాక , కన్నాయిగూడెం , పిచుకలపాడు , పురుషోత్తపట్నం , గుండాల అనే ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ మాటలపై ఆంధ్రా మంత్రులు ఫైర్ అయ్యారు .

నిన్నగాక మొన్న గోదావరికి వచ్చిన భారీ వరదలు తెలంగాణ ,ఆంధ్రా రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను పట్టణాలను నీటముంచాయి. లక్షమందికి పైగా నిరాశ్రయిలైయ్యారు . ప్రత్యేకంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపానికి ప్రజలు భీతిల్లి పోయారు . అక్కడే మకాం వేసి పరిస్థితులను స్వయంగా చుసిన మంత్రి అజయ్ గోదావరి వరదలపై లోతుగా పరిశీలించారు . ఎన్నుడు లేంది భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా కదలటంపై ఆరా తీశారు . అందుకు పోలవరం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్ట్ ప్రధాన కారణంగా నిర్దారణకు వచ్చారు . భద్రాచలం చుట్టుపక్కల ప్రజలు వరదల భారీ నుంచి గట్టు ఎక్కాలంటే కరకట్ట నిర్మించడమే పరిస్కారం మార్గంగా భావించి ఆంధ్రా కు కేటాయించిన మండలాల్లోని కేవలం ఐదు ఊళ్ళు తిరిగి ఇస్తే భద్రాచలం పట్టణంతో పటు చుట్టుపక్క గ్రామాలకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టవచ్చునని అనుకున్నారు . అదే విషయం ఈరోజు హైద్రాబాద్ లోని టీఆర్ యస్ ఎల్ఫీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు . దానిపై ఆంధ్రా మంత్రులు ఫైర్ అయ్యారు . అజయ్ మాటలు అసంబద్ధం ,అసమంజసం అన్నారు . తమకు హైద్రాబాద్ , భద్రాచలం ఇవ్వమంటే ఇస్తారా అని ప్రశ్నించారు . పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులతో కడుతున్న ప్రాజెక్ట్ దానిపై మంత్రి అజయ్ రాద్దాతం చేసేందుకు ప్రయత్నించడం తగదన్నారు .

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పువ్వాడ మాటలపై ఘాటుగా స్పందించారు. సీఎం అయినా, మంత్రులైనా, ఇంకెవ‌రైనా బాధ్య‌త‌గా మాట్లాడాల్సిందేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు మంచిది కాద‌ని కూడా ఆయ‌న ఒకింత హెచ్చరిస్తున్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించాల‌ని, విలీన మండ‌లాల్లోని 5 గ్రామాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బొత్స త‌ప్పుబ‌ట్టారు.

పోల‌వ‌రం ఎత్తును ఎవ‌రు పెంచార‌ని ఈ సంద‌ర్భంగా బొత్స ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం నిర్మాణం అనుమ‌తి పొందిన డిజైన్ల ప్ర‌కారమే జ‌రుగుతోంద‌ని, వాటిని ఎవరూ మార్చ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే అంతా జ‌రుగుతోంద‌ని తెలిపారు. పోల‌వరం వ‌ల్ల భ‌ద్రాచ‌లం ముంపు ఉంటుంద‌ని ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ప్ర‌స్తావించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ముంపు మండ‌లాల బాధ్య‌త ఏపీదేన‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ముంపు మండ‌లాల ప్ర‌జ‌లు ఏపీ రాష్ట్ర కుటుంబ‌స‌భ్యులని అయన స్ప‌ష్టం చేశారు. త‌మ రాష్ట్ర ప్ర‌జ‌లైన ముంపు మండ‌లాల ప్ర‌జ‌ల సంగ‌తి తాము చూసుకుంటామ‌ని తెలిపారు. తెలంగాణ నేత‌లు ఖ‌మ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగ‌తి చూసుకుంటే స‌రిపోతుంద‌ని బొత్స అన్నారు.

రాష్ట్ర విభజ‌న వ‌ల్ల హైద‌రాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయింద‌న్న బొత్స‌.. అందుక‌ని హైద‌రాబాద్‌ను ఏపీలో క‌లిపేయ‌మ‌ని అడ‌గ‌గ‌ల‌మా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు క‌లిస్తే ఎవ‌రికీ ఇబ్బంది లేదు క‌దా? అని కూడా బొత్స అస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ఇప్పుడు ముఖ్య‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కొంద‌రు వ్య‌క్తులు బాధ్య‌త‌గా మాట్లాడాల్సి ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సీఎం అయినా, మంత్రులు అయినా బాధ్య‌త‌గానే మాట్లాడాల‌న్నారు. రెచ్చ‌గొట్టే మాట‌లు స‌రికాద‌ని బొత్స హితవు పలికారు.

ఏపీ జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు కూడా పువ్వాడ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

నేటి సాయంత్రం మీడియా ముందుకు వ‌చ్చిన అంబ‌టి… బాధ్య‌తాయుతమైన ప‌ద‌వుల్లో ఉన్న‌వారు జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని సూచించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై తెలంగాణ నేతల వ్యాఖ్య‌లు స‌రికాద‌ని ఆయ‌న తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు సీడ‌బ్ల్యూసీ అనుమ‌తితోనే నిర్మాణం జ‌రుగుతోంద‌ని ఆయ‌న తెలిపారు.

పోల‌వ‌రం ఎత్తు పెంపుపై వివాదం స‌రికాద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. పోల‌వ‌రం ప్రాజెక్టును ద‌శ‌ల‌వారీగా పూర్తి చేస్తామ‌న్న అంబ‌టి… ప్రాజెక్టు వ‌ల్ల ముంపు ఉంద‌న్న భావ‌న‌తోనే 7 మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేశార‌ని తెలిపారు. ఇప్పుడు ముంపు ఉందంటున్న నేత‌లు… తాము భ‌ద్రాచ‌లం కావాల‌ని అడిగితే ఇచ్చేస్తారా? అని అంబ‌టి ప్ర‌శ్నించారు.

ఏపీ మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

భ‌ద్రాద్రిపై తెలంగాణ ప్ర‌భుత్వం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపుతోంద‌ని ఆయన ఆరోపించారు. యాదాద్రి ఆల‌యాన్ని పునర్నిర్మించిన‌ట్లుగా భ‌ద్రాద్రి ఆలయానికి నిధులు కేటాయించి ఎందుకు అభివృద్ధి చేయ‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ‌కు భ‌ద్రాద్రిపై ప్రేమ లేకుంటే ఏపీకి ఇచ్చేయండి అని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్లే భ‌ద్రాద్రి ముంపున‌కు గురి అయ్యింద‌న‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని నాని పేర్కొన్నారు.

Related posts

కుట్ర కోణం ఉందో, లేదో దర్యాప్తులో తేలుతుంది.. చీమలపాడు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్…

Drukpadam

ఏపీపై  బీజేపీ ఫోకస్ …అమిత్ షా,జేపీ నడ్డా రాక

Drukpadam

చేతులెత్తేసిన ప్రతిపక్షాలు.. నేపాల్ ప్రధానిగా మళ్లీ ఓలి!

Drukpadam

Leave a Comment