పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన!
- పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా నిరసన
- మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- లోక్ సభ, రాజ్యసభలలో విపక్షాల ఆందోళనలు
టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అంశాలపై లోక్ సభలో ఈరోజు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబట్టి, స్పీకర్ ఛైర్ ను చుట్టుముట్టారు. దీంతో విపక్ష సభ్యుల వైఖరి పట్ల స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభలోకి ప్లకార్డులకు అనుమతి లేదని చెప్పారు. రాజ్యసభలో సైతం ఇదే తరహా గందరగోళం నెలకొంది. ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపు, ధరల పెరుగుదలను నిరసిస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
కేంద్రానికి వ్యతిరేకంగా గొంత్తెత్తి నినదించిన పారిశ్రామిక వేత్తలు
టిఆర్ఎస్ కు చెందిన ఎంపీలు నేడు ధరల పెరుగుదలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సహజంగా ప్రతిసారి నిరసనలు గాంధీ విగ్రహం వద్ద జరుగుతుంటాయి. అనేకమంది వివిధ పార్టీలకు చెందిన వారు ఇక్కడ నిరసనలు తెలియ చేయటం సాంప్రదాయంగా మారింది. అయితే ఇటీవల లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వేరువేరుగా పార్లమెంట్ సభ్యులు ప్రవర్తించాల్సిన నియమ నిబంధనలు తెలియజేస్తూ ఒక బుక్లెట్ అందజేశారు. అందులో పార్లమెంట్ హౌస్ లో ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించరాదని ఉపయోగించకూడని కొన్ని పాదాలను విడుదల చేశారు . పార్లమెంట్ ఆవరణలో ఎలాంటి నిరసనలు తెలియ చేయరాదని పేర్కొన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ హౌస్ లో ప్లే కార్డు లు ప్రదర్శించరాదని కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ వారి నిబంధనను భేఖాతర్ చేస్తూ ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు నిరసనలు తెలిపారు. ఇందులో విశేషం ఏమిటంటే టిఆర్ఎస్ కు చెందిన పార్లమెంట్ సభ్యులు ఇప్పటివరకు ఎలాంటి ప్రదర్శనలలో పాల్గొని వారు ఉన్నారు . వారిలో ప్రధానంగా హెటిరో డ్రగ్స్ కు చెందిన బండి పార్థసారథి రెడ్డి ఉండటం గమనార్హం. అంతేకాకుండా మరి కొంత మంది కొత్తగా వెళ్ళిన పార్లమెంట్ సభ్యులు కూడా గతంలో ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు . పారిశ్రామిక వేత్తలు అయిన వీరు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం అంటేనే వారికి చికాకుగా ఉంటుంది . ఎలాంటి ఈ నిరసన కార్యక్రమంలను వారు అంగీకరించరు. కానీ వారి ఈరోజు పార్టీ నిర్ణయానికి కట్టుబడి నిరసన ప్రదర్శనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడంవిశేషం. అనేకమంది పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం