ఆంధ్రప్రదేశ్

ఎంపీగా మారిన ప‌రుగుల రాణి!.. సంతోషంగా ఉందంటూ మోదీ ట్వీట్‌!

ఎంపీగా మారిన ప‌రుగుల రాణి!.. సంతోషంగా ఉందంటూ మోదీ ట్వీట్‌!

  • రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన పీటీ ఉష‌
  • ఇటీవ‌లే రాజ్య‌సభ స‌భ్యురాలిగా పద‌వీ ప్ర‌మాణం
  • బుధ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిసిన ఉష‌
  • ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన మోదీ

భార‌త‌ ప‌రుగుల రాణి పీటీ ఉష రాజ్య‌స‌భ సభ్యురాలిగా మారిపోయారు. ఇటీవ‌లే ద‌క్షిణాదికి చెందిన న‌లుగురు ప్ర‌ముఖులు రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన సంగ‌తి, వీరిలో పీటీ ఉష కూడా ఉన్న విష‌యం తెలిసిందే. కొత్త‌గా రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన వారిలో పలువురు సోమవారమే ప్రమాణ స్వీకారం చేయగా.. పీటీ ఉష బుధవారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు.

తాజాగా బుధ‌వారం పార్ల‌మెంటులో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని పీటీ ఉష క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆమెతో వున్న ఫొటోను మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పార్ల‌మెంటులో పీటీ ఉష‌ను చూడ‌టం సంతోషంగా ఉందంటూ మోదీ త‌న ట్వీట్‌కు ఓ కామెంట్ జ‌త చేశారు. ఇదిలా ఉంటే… రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేస్తున్న వీడియోను పీటీ ఉష సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Related posts

ఎల్బీనగర్ అగ్ని ప్రమాదంలో 3 కోట్ల నష్టం.. ఏడుస్తూ సొమ్మసిల్లిపడిపోయిన యజమాని…

Drukpadam

ఇప్పటికే 87 పెళ్లిళ్లు.. 61 ఏళ్ల వయసులో 88వ వివాహానికి రెడీ అవుతున్న ‘ప్లేబోయ్’

Drukpadam

రష్యా రూటు మార్చింది జాగ్రత్త!: బ్రిటన్ హెచ్చరికలు

Drukpadam