పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి ముప్పు :మంత్రి పువ్వాడ…
-బ్యాక్ వాటర్ తీవ్రత ఇప్పుడే తెలిసింది …
-పోలవరం డిజైన్ 30 లక్షల క్యూసెక్కులే …తరవాత ఎత్తు పెంచారు
-ఇది అన్యాయం అంటున్నాం
-ఐదు గ్రామాలూ ఇవ్వాల్సిందే …అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి
-విలీన మండలాలు ఖాళీ అవుతున్నాయి
-ఏడూ మండలాలు తీసుకున్నప్పుడు ప్రజాభిప్రాయం తీసుకున్నారా ?
-తెలంగాణ భూభాగం తెలంగాణకు ఇవ్వాల్సిందే
పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి ముప్పు తప్పదని ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు . మొన్న వచ్చిన వరదల వల్లనే బ్యాక్ వాటర్ తీవ్రత తెలిసిందని అన్నారు . వరదల సందర్భంగా అక్కడే మకాం వేసి స్వయంగా చూశామని అనేకమంది స్థానికులు , నిష్ట్నాతులు వరదలు వచ్చినా ఎప్పడు ఇన్ని రోజులు ,నిలకడగా గోదావరి ప్రవహించలేదని పోలవరం డాం వల్లనే వరద స్పీడ్ తగ్గి భద్రాచలం వరకు ఇంకా పైకి నిలకడగా ప్రవహించిందని అందువల్లనే ముంపు ప్రాంతాల పెరిగాయని చెబుతున్నారని మంత్రి అన్నారు . పోలవరం డాం తెలంగాణకు జరుగుతున్నా అన్యాయంపై
ఒక టీవీ డిబేట్ లో పాల్గొన్న మంత్రి తెలంగాణ వాదనను బలంగా వినిపించారు. పోలవరం బ్యాక్ వాటర్ తీవ్రత ఇప్పుడే గుర్తించగలిగామని అందువల్లనే ప్రజలను రక్షించేందుకు ఐదు గ్రామాలూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అసలు పోలవరం వర్జినల్ డిజైన్ ఎంత ఇప్పుడు వాళ్లు ఎంత ఎత్తు కడుతున్నారు . అనేది కదా ప్రశ్న అని అన్నారు . వాళ్లు ఇష్టం వచ్చినట్లు ఎత్తుకడితే మునిగేది తెలంగాణ ప్రజలు కదా ? అని ప్రశ్నించారు . పోలవరం లో కేవలం 30 లక్షల క్యూసెక్కుల నీరు నీళ్లు నిల్వకోసమే ప్రాజెక్ట్ అన్నారు .ఇప్పుడు దాన్ని మూడు మీటర్ల ఎత్తు పెంచారు . దీనివల్ల భద్రాచలం దేవాలయం మునిగిపోనున్నది అందువల్ల ఎత్తు పెంచవద్దని అంటున్నామని వివరించారు . మండల విలీనం ,గ్రామాల అప్పగింత శాస్త్రీయ పద్దతిలో జరగలేదు .ఇప్పుడు ఐదు గ్రామాలూ కీలకమైనవి వాటిని తిరిగి తెలంగాణకు ఇస్తే గోదావరి ముంపు లేకుండా వాళ్ళను కూడా రక్షించే అవకాశం ఉంది. ఆ ఐదు గ్రామాల ప్రజలకు కూడా మేమే పునరావం కల్పించాం ఆగ్రామాల వాళ్లు కూడా తెలంగాణాలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు వాళ్ళను ఆంధ్రా వాళ్లు పట్టించుకున్న దాఖలాలు లేవు . ఏది కావాలన్నా తెలంగాణ కు రావాల్సిందే . ప్రజల అభిప్రాయాలు తీసుకోండి. వారు ఇష్టప్రకారం నడవనివ్వండని మంత్రి అజయ్ తన వాదనలు వినిపించారు .
ఇప్పటికే వీలైన మందలు ఖాళీ అవుతున్నాయని ,ఏడూ మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు ప్రజాభిప్రాయం తీసుకోకపోవడాన్ని మంత్రి తప్పు పట్టారు . తెలంగాణ నుంచి పార్లమెంట్ లో బిల్లు పెట్టి తీసుకున్న భాభాగం అంట తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక బిల్లు పెట్టాలని టీఆర్ యస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు . తెలంగాణ ప్రాంతం భద్రాచలానికి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన ప్రజల ప్రాణాలను కాపాడగలిగామని ,తెలిపారు . అందువల్ల పోలవరం ఎత్తు తగ్గించడంతోపాటు , విలీన మండలాలను , గ్రామాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు