Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా డోంట్ కేర్ పోలవరం పూర్తి చేస్తాం: జీవీఎల్…

తెలంగాణ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా డోంట్ కేర్ పోలవరం పూర్తి చేస్తాం: జీవీఎల్…
-పోలవరం నిర్మాణానికి గతంలో తెలంగాణ ఒప్పుకుందన్న జీవీఎల్
-టీఎస్ మంత్రుల వ్యాఖ్యలను రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామని వ్యాఖ్య
-వరద నష్టం అంశాన్ని పార్లమెంటులో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్న ఎంపీ

పోలవరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల పంటతో పాటు, భద్రాచలం, పర్ణశాల వంటి ప్రదేశాలు నీట మునుగుతాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తెలంగాణ ఒప్పుకుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కేంద్ర చట్టంలో ఉందని చెప్పారు. అందువల్ల వారి వాదనలు పట్టించుకోవాలన్సిన అవసరంలేదని డోంట్ కేర్ పోలవరం పూర్తి చేసి తీరతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు స్పష్టం చేశారు .

పోలవరం ఆనకట్ట వల్ల భద్రాచలంతో పాటు చుట్టుపక్క గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోలవరం మొదట ఇచ్చిన డిజైన్ కన్నా మూడు మీటర్లు ఎక్కువ ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగున్నదని తెలంగాణ కు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపిస్తున్న తరణంలో బీజేపీ వైఖరిని జివిఎల్ స్పష్టం చేయడం గమనార్హం…

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుతో భద్రాచలంకు ముప్పు ఉందనే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను తాము రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామని అన్నారు. తెలంగాణ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. వరద నష్టం అంశాన్ని పార్లమెంటు సమావేశాల జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ సమావేశాలు జరగకుండా నిలువరించి, రాజకీయ లబ్ధి పొందాలని యత్నిస్తున్నాయని మండిపడ్డారు.

Related posts

మరోసారి బీజేపీతో యుద్దానికి సిద్దమైన కేసీఆర్ !

Drukpadam

ద్వారంపూడికి భీమ్లానాయక్ ట్రీట్ మెంట్ చూపిస్తా: చంద్రశేఖర్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్!

Drukpadam

హరీశ్ రావు తోలుబొమ్మ… లక్ష ఓట్ల మెజార్టీతో ఈటల గెలుస్తారు: జితేందర్ రెడ్డి!

Drukpadam

Leave a Comment