Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిండుకుండలా శ్రీశైలం జలాశయం..

నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. కాసేపట్లో క్రస్ట్ గేట్లను ఎత్తిన మంత్రి అంబటి రాంబాబు!

  • 882.50 అడుగులకు చేరుకున్న జలాశయం నీటిమట్టం
  • ప్రాజెక్టులోకి వస్తున్న 81,853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
  • కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరడంతో ఈ ఏడాది తొందరగా నే శ్రీశైలం నిండుకుండను తలపిస్తున్నది 885 అడుగులు శ్రీశైలం డ్యాం నీటిమట్టంకాగా ప్రస్తుతం 882.50 చేరింది. దీంతో క్రస్ట్ గేట్లను ఎట్టి నీటిని కిందకు వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉదయం 11 గంటలకు గేట్లను ఎత్తి నీటిని జీవో విడుదల చేశారు. ఈ నీరు సాగర్ డ్యాం లోకి వస్తుంది. సాగర్ డ్యాం కూడా త్వరలోనే నిండుకుండను తలపిస్తున్నదని అధికారులు భావిస్తున్నారు . ఈ రెండు ప్రాజెక్టుల్లో నిండుగా నీరు ఉంటే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే శ్రీశైలం కుడి ,ఎడమ విద్యుత్ సబ్ స్టేషన్లు పనిచేస్తుండగా ,సాగర్ లో కూడా నీరు నిండితే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి . శ్రీశైలం డ్యాం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు అక్కడికి చేరుకున్నారు. మరి కొద్ది రోజుల పాటు ఈ దృశ్యం చూసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అందువల్ల సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు శ్రీశైలం చేరుకొని అక్కడ దృశ్యాలు తనవితీరా చూసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటున్నారు . ఇక్కడ దృశ్యాలు చూడముచ్చటగా ఉండి ప్రజలను ఆకర్షిస్తున్నాయి .

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. వేలాది క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటుండటంతో… శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా… 57,751 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.0439 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమవైపు ఉన్న ఏపీ, తెలంగాణ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

మరోవైపు జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో… క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే శ్రీశైలంకు చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదలచేశారు . మరోవైపు, ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు కూడా అక్కడకు చేరుకుంటున్నారు.

Srisailam reservoir filled with flood water

Related posts

వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తల దాడి.. తలారి వెంకట్రావుకు గాయాలు!

Drukpadam

సీఎం జగన్ పిటిషన్ పై సీబీఐ-ఈడీ కోర్టులో విచారణ…

Drukpadam

మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నారు.. 75 ఏళ్లుగా ఇదే తంతు: పాకిస్థాన్ ప్రధాని ఆవేదన

Drukpadam

Leave a Comment