Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హాలియాలో చప్పగా సాగిన కేసీఆర్ ప్రసంగం…

హాలియాలో చప్పగా సాగిన కేసీఆర్ ప్రసంగం…
సాగర్ కు జానారెడ్డి చేసింది శూన్యమన్న కేసీఆర్
-నాగార్జున సాగర్ లో అభివృద్ధి టీఆర్ యస్ చేసిందే
-60 ఏళ్ల కాంగ్రెస్ ఆగమాగం …
-పైరవీ లేని తెలంగాణ
-భారత్ గెలిస్తే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ
-అంజయ్య కు మంచి భవిషత్
-లిఫ్టులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ
-నందికొండలో డిగ్రీ కళాశాలకు హామీ
-ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో గ్రహించి ఓటు వేయాలి:‌
-ఉపఎన్నిక కోసం కేంద్రమంత్రులు వస్తున్నారంటూ బీజేపీపై విమర్శలు
-పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అంత చేశాను ఇంత చేశాను అని చెబుతున్న జానారెడ్డి చేసింది సూన్యమని ముఖ్యమంత్రి విమర్శించారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా నేడు కేసీఆర్‌ హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దూకుడుగా,ప్రజలను ఆకట్టుకునేలా సాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం సప్పగా సాగిందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రలో జరుగుతున్నా అభివృద్ధి ,సంక్షేమ పై, వివిరాలు చెప్పినప్పటికీ అవి కేసీఆర్ సహజశైలికి భిన్నంగా ఉండటం గమనార్హం . జానారెడ్డి పేరును పదేపదే ప్రస్తావించారు. జానారెడ్డి వల్లనే తాను సీఎం అయ్యానని ఒకాయన చెబుతున్నాడు. ఆయన భిక్ష కాదు తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు. పదవులకోసం ఏనాడూ పాకులాడలేదని ఉద్యమం ప్రారంభించేటప్పుడే డిప్యూటీ స్పీకర్ పదవి ఎమ్మెల్యే పదవి గడ్డిపూసలా వదిలేశానని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణను ఆగమాగం చేశారని విమర్శించారు.అవినీతి లేని తెలంగాణ సాధించుకున్నామని అందువల్లనే రైతుబంధు, రైతుభీమా ఎవరి పైరవీ లేకుండా వస్తున్నాయని అన్నారు. ఎవరు గెలిస్తే నాగార్జునసాగర్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో గ్రహించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్యను కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కురిపించే ఓట్లలాగే నెల్లికల్‌ లిఫ్టు నుంచి నీళ్లు దూకుతాయని హామీ ఇచ్చారు. నెల్లికట్టుతో పాటు ఉమ్మడి నల్గొండ కోసం మంజూరు చేసిన దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌ లిఫ్టులన్నింటినీ పూర్తి చేసి తీరతామని హామీ ఇచ్చారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని తెలిపారు.

ఒక ఉప ఎన్నిక కోసం ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు వస్తున్నారని పరోక్షంగా బీజేపీపై కేసీఆర్‌ విమర్శలు చేశారు. నందికొండకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న జానారెడ్డి 30 ఏళ్లలో హాలియాకు డిగ్రీ కళాశాలను కూడా తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం పాకులాడాతారన్నారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టారన్నారు.

తెరాస ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ సందర్భఃగా కేసీఆర్‌ ప్రజలకు వివరించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ పథకాలు గతంలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. పైరవీలు, మధ్యవర్తులు లేకుండా అందరికీ రైతుబంధు అందిస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ పేరిట ఇంటింటికీ అందిస్తున్న నల్లానీటిలో కేసీఆర్‌ కనిపించట్లేదా? అని ప్రజలను ప్రశ్నించారు. గిరిజనుల పోడు భూముల సమస్యను ప్రజాదర్భార్ పెట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కుల, మత, జాతి వంటి భేదం లేకుండా ప్రతి వర్గం కోసం తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్‌ తెలిపారు. ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు హాలియాలో షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో భగత్‌ గెలిస్తే నియోజకవర్గానికి చెందిన కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేయడం ఖాయమని తెలిపారు. అలాగే ఇటీవల పార్టీలో చేరిన బీజేపీ నేత కడారి అంజయ్యకు సైతం పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.

Related posts

హైకోర్టు తీర్పుపై అప్పీల్ అవ‌స‌రం ఏముంది?: మంత్రి బొత్స

Drukpadam

భార‌త్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ… 

Drukpadam

ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ … ఇటీవల తుమ్మల తో భేటీ పై జిల్లాలో ఉత్కంఠత …

Drukpadam

Leave a Comment