Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మాణిక్యం ఠాకూర్ వచ్చారు…

మాణిక్యం ఠాకూర్ వచ్చారు…
-మీడియా సమావేశం పెట్టారు
-ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ నాగార్జున సాగర్ కు జరుగుతున్నా ఉపఎన్నికల ప్రచారానికి రావటంలేదని ఆయన ఎక్కడ ఉన్నారు,ఎందుకు రావటంలేదు అనే సందేహాలు తలెత్తాయి.చివరకు ఎట్టకేలకు ఆయన వచ్చారు.సాగర్ లో జరుగుతున్నా ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆయన తమిళనాడులో ఈ నెల 6 తేదీన అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మాణిక్యం ఠాకూర్ డి తమిళనాడు అయినందున ఎక్కడ డీఎంకే తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ ప్రచారంలో ఆయన ఉన్నారు .పైగా ఆయన తమిళనాడు నుంచి లోకసభకు ఎన్నికైయ్యారు. అందువల్ల ఎక్కడ ప్రచారంలో అందులో ఆయన లోకసభ పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించాల్సి రావటంతో అక్కడే ఉన్నారు. అయితే 6 తేదీన ఎన్నికలు అయిన వెంటనే ఠాకూర్ వస్తారని కాంగ్రెస్ శ్రేణులు అనుకున్నాయి. కాని ఆయన రాలేదు. దీంతో మాణిక్యం ఠాకూర్ కు ఏమైంది అనే ఆరా తీయటం మొదలు పెట్టారు . ఇక ఈ ఎన్నికలకు ఆయన రారేమోనని అనుకున్నారు. కాని ఆయన వచ్చారు. కదన రంగంలోకి దిగారు. నల్లగొడకు వచ్చారు. టీపీసీసీ చీఫ్ నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భవనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా కేసీఆర్ విధానాలపై విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ ను గెలిపించాలని , అన్నారు. మీడియా సమావేశంలో ఉత్తమ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి మాట్లాడారు.అనంతరం వారు సాగర ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు.
సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డిని మరోసారి గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కోరారు. మండలంలోని బొల్లారం, నడికూడ, మెసంగి గ్రా మాల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి బుధవారం ప్రచారం నిర్వహి ంచారు. ఈ ఎన్నిక సాగర్‌ పరువుకు సంబంధించిందన్నారు. ఇక్కడి ప్రజలు ఏడుసార్లు జానారెడ్డిని అసెంబ్లీకి పంపారని ఈ సారి కూడా అసెంబ్లీకి పంపితే ప్రజల తరుఫున పోరాడుతారన్నారు. జానారెడ్డిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీ రుణం తీ ర్చుకోవాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మా ట్లాడు తూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ ఎస్‌ ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందన్నారు.

Related posts

గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు దక్కేవి రెండు సీట్లేనట: ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే..తమదే గెలుపు అంటున్న కేజ్రీవాల్ …!

Drukpadam

ఎయిమ్స్ లో రఘురామకు వైద్య పరీక్షలు.. రెండు కాళ్లకు కట్లు …

Drukpadam

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీతో ఇక తెగదెంపులేనా …?

Drukpadam

Leave a Comment