Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజకీయాలకు అతీతంగా అభివృద్ది కి సిద్ధం…అందుకు ముఖ్యమంత్రిని కలుస్తా :సీఎల్పీ నేత భట్టి…

రాజకీయాలకు అతీతంగా అభివృద్ది కి సిద్ధం…అందుకు ముఖ్యమంత్రిని కలుస్తా :సీఎల్పీ నేత భట్టి…
మంత్రులు కలువడానికి వెనుకాడను
అందరికి ఫించన్లు ఇప్పించేందుకు కృషి చేస్తాను.
క్రమ పద్దతిలో ముదిగొండను అభివృద్ధి చేసుకుందాము
ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాజాకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అభివృద్ది కొరకు సీఎం, మంత్రులు ఎవరినైన కలుస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క‌ పుణరుద్ఘాంటించారు. గురువారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో సామాజిక ఫించన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైనారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ముదిగొండ మండలాన్ని క్రమ పద్దతిలో అభివృద్ది చేసుకుందామన్నారు. మండల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి బడ్జెట్లో ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నట్టు చెప్పారు. బిసి హస్టల్ భవన నిర్మాణానికి సంబంధిత శాఖ మంత్రిని కలిసి నిధులు తీసుకువస్తామన్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీ తాత మధు కూడ మంత్రికి లెటర్ రాయడంతో పాటు నాతో కలిసి వస్తే మంత్రి దగ్గర కూర్చోని భవన నిర్మానికి నిధులు మంజూరు చేయించుకోవచ్చని సూచించారు. గురుకుల పాఠశాల భవనానికి రూ.22 కోట్లు ఇవ్వాలని ప్రతి బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెచ్చించడానికి వీలున్నందున సంబంధిత మంత్రిని కలిసి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కస్తూరీభా పాఠశాలకు స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని వేదిక మీద ఉన్న తహశీల్దార్ ను ఆదేశించారు. జూనియర్ కళశాల నిర్మాణం, అందులో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి విద్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసి సమస్యల‌ పరిష్కారం చేసుకుందామని చెప్పారు. ముదిగొండ మీదుగా వెళ్తున్న కోదాడ-ఖమ్మం హైవే రోడ్డుపైన హైలేవల్ బ్రిడ్జీ నిర్మాణాల గురించి ఆర్ అండ్ బి అధికారులతో చర్చిస్తానని చెప్పారు. ముదిగొండ మండల కేంద్రంలో డ్రైనేజీ, రోడ్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న వారి జీవనభృతికి ఫించన్లు ఇవ్వడం ప్రభుత్వాల సామాజిక బాధ్యత అన్నారు. ఫించన్ల పంపిణీ ఆయా రాష్ట్రాల ఆదాయాలను బట్టి ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న ఫించన్ డబ్బులు భవిష్యత్తులో కచ్చితంగా పెరుగుతాయన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఫించన్లు రాని వారు ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరకీ ఫించన్లు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు.

Related posts

ప్రశాంత్ కిశోర్ చేరికపై కాంగ్రెస్ లో ఎవరికీ అభ్యంతరం లేదు: దిగ్విజయ్ సింగ్

Drukpadam

లెఫ్టినెంట్​ గవర్నర్​ చేతుల్లోకి ఢిల్లీ పాలన…ఉత్సవ విగ్రహంగా సీఎం

Drukpadam

మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ఉద్రిక్త‌త‌!

Drukpadam

Leave a Comment