Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తున్న కేంద్ర సర్కార్…

తెలుగు రాష్ట్రాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తున్న కేంద్ర సర్కార్
విభజన చట్ట హామీలను విస్మరించిన బిజెపి ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్

తెలుగు రాష్ట్రాల మధ్యన కేంద్ర ప్రభుత్వం వైషమ్యాలు పెంచి భావోద్వేగతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నదని సీల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. గురువారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎలీ నేత మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వ‌చ్చిన బిజెపి ప్ర‌భుత్వం 8 ఏండ్లుగా విభ‌జ‌న చ‌ట్టం హామీల‌ను తుంగ‌లో తొక్కింద‌న్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని విద్యుత్ శాఖకు సంబంధించిన అంశంలో జోక్యం చేసుకొని ఎ.పికి పుణ‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం విద్యుత్ బకాయిలను రూ.6,756 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన బయ్యారం ఉక్కు కర్మగారం, ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, నీటిపారుదల జాతీయ ప్రాజెక్టు, గిరిజన యూనివర్శీటీ, ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ. లక్ష కోట్ల పైగా కేంద్రం నుంచి నిధులు వచ్చేవి అన్నారు. వీటి గురించి కేంద్ర ప్రభుత్వం ఊసేత్తకుండ ఎ.పికి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా పట్టించుకోకుండా తెలంగాణకు తీవ్రంగా ఆన్యాయం చేస్తున్నదన్నారు. కేంద్రానికి సంబంధం లేనటువంటి అంశంలో జోక్యం చేసుకోని ఎ.పికి విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం వారి లోపాలను కప్పి పుచ్చుకోవడం కోసమేనని, రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండ వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కొరకు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి సమంజసంగా లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందన్నారు. కానీ వాటిని ఇవ్వకుండ కేంద్ర ప్రభుత్వం తన నిబద్ధతను విస్మరించిందన్నారు. విశాలంగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం కుంచిత మనస్వత్వంతో ఆలోచన చేస్తే ఫెడరల్ స్పూర్తికి దెబ్బతీసినట్టు అవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్యన భావోద్రేకాలు రెచ్చగొట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఆనాడు విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts

కాంగ్రెస్ లో గాంధీ కుటుంబానిదే పట్టు ..నిరూపించిన అధ్యక్ష ఎన్నిక!

Drukpadam

కాంగ్రెస్ లో లొల్లి… కార్యకర్తల పరేషాన్ …

Drukpadam

హైద్రాబాద్ ఫిలిం నగర్ లో ఎన్టీఆర్ కు మంత్రి అజయ్ నివాళులు …

Drukpadam

Leave a Comment