ఖమ్మం కార్పొరేషన్ లో డివిజన్ల వారీగా రిజర్వేషన్లు
-ఎన్నికల కోసం అధికారుల ఉరుకులు పరుగులు
-అభ్యర్థుల ఎంపికలో రాజకీయపార్టీలు
-పొత్తులు ఎత్తులు
ఖమ్మం నగరంలో కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.ఈ నెల 30 జరగనున్న ఎన్నికలకోసం షడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి పార్ధసారధి ప్రకటించారు. రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల కానున్నది . దీనికోసం జిల్లా అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తుంది.గురువారమే ఖమ్మం కార్పొరేషన్ డివిజన్ల వారీగా రిజర్వేషన్ లు ప్రకటించారు.గతంలో 50 డివిజన్లు గా ఉన్న ఖమ్మం కార్పొరేషన్ పునర్విభజనలో 60 డివిజన్లుగా మారింది. అన్ని పార్టీలకంటే టీఆర్ యస్ ముందున్నది . తిరిగి కార్పొరేషన్ కైవశం చేసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతుంది. ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయి.అనేది ఆశక్తిగా మారింది. గతంలో బలంగా ఉన్న సిపిఎం కొన్ని డివిజన్లకు పరిమితం కావడం , సిపిఐ టీఆర్ యస్ కు దగ్గరగా ఉండటం ,సాగర్ ఎన్నకల్లో సిపిఐ,సిపిఎం లు అధికార టీఆర్ యస్ కు మద్దతు ప్రకటించాయి దీంతో కార్పొరేషన్ లలో కూడా ఆ పార్టీలు టీఆర్ యస్ తో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయని అభిప్రాయాలూ ఉన్నాయి. కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది ఒంటరిగా వెళ్లడమా లేక పొత్తులు పెట్టుకోవడమే అనేదానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్న ఓట్ల బదిలీ నే కీలకం కానున్నది.తెలుగుదేశం నుంచి అనేక మంది టీఆర్ యస్ లో చేరారు. దాని ఉనికి ప్రశ్నర్ధకంగానే ఉంది.ఇక బీజేపీ ఈ సారి కొన్ని డివిజన్లలోనైనా సత్తా చాటాలని చూస్తుంది.
మొత్తం 60 డివిజన్లలో ఎస్టీ లకు 3 డివిజన్లు ఇందులో 32 డివిజన్ ఎస్టీ మహిళకు 1 8 ఎస్టీ జనరల్ కేటాయించారు.
ఎస్ .సి లకు 7 డివిజన్లు అందులో 22 ,42 ,59 డివిజన్లు మహిళలకు ,40 43 ,52 ,60 ఎస్ .సి లలో జనరల్ కేటాయించారు.
బిసి లకు 20 డివిజన్లు వాటిలో 10 బిసి మహిళలకు ,10 బిసి లలో జనరల్ కేటాయించారు.
వాటిలో 28 ,29 ,30 ,33 ,34 38 ,46 47 48 57 లలో బిసి మహిళలు
2 ,7 ,14 16 19 ,24 ,25 31 ,44 ,51 బిసి జనరల్ కు కేటాయించారు.
మరో 30 డివిజన్లు జనరల్ కేటగిరిలో ఉండగా వాటిలో 16 మహిళలకు 14 డివిజన్లు జనరల్ గా ఉన్నాయి.
వాటిలో 5 ,9 10 ,11 12 15 17 18 20 21 37 53 54 55 56 58 జనరల్ మహిళలకు
3 4 6 13 23 26 27 35 36 39 41 45 49 50 జనరల్ కేటగిరిలో ఉన్నాయి
ఖమ్మం కార్పొరేషన్ డివిజన్ల వారీగా రిజర్వేషన్ల వివరాలు
1 . డివిజన్ కైకొండాయిగూడెం , టీ ఎన్ జి ఓ కాలనిలో కొంత భాగం …. ఎస్టీ జనరల్
2 .డివిజన్ ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ ఏరియా పాండురంగాపురం ……………..బిసి జనరల్
3 డివిజన్ .బల్లేపల్లి ఎస్ సి కాలనీ జయనగర్ కాలనీ ……………………………………. జనరల్
4 డివిజన్ పాండురంగాపురం , అమరావతి నగర్ , యూ పి హెచ్ కాలనీ కొంత భాగం …జనరల్
5 డివిజన్ యూ పి హెచ్ కాలనీ , మంచికంటి నగర్ రాజీవ్ గుట్ట , బాలాజీ నగర్ ….జనరల్ మహిళా
6 డివిజన్ . రస్తోగినగర్ ప్రశాంతి నగర్ ,ఖానాపురం కాలనీ ……………………….బిసి జనరల్
7 .డివిజన్ ఖానాపురం,టేకులపల్లి …………………………………………బిసి జనరల్
8 .డివిజన్ బలపేట ఎల్ బీ నగర్,వైయస్ ఆర్ కాలనీ ,గోపాలపురం…………….. ఎస్టీ జనరల్
9 ,డివిజన్ రోటరీ నగర్ …………………………………………………………………………జనరల్ మహిళ
10 .డివిజన్ ఇందిరా నగర్ న్యూవిజన్ ప్రాంతం , చెతన్యనగర్ ,టూ టౌన్ పోలీస్ స్టేషన్ … జనరల్ మహిళ
11 .డివిజన్ కవిరాజ నగర్,వరదయ్య నగర్ , ………………………………………………జనరల్ మహిళ
12 డివిజన్ .వీ ఆర్ కె సిల్క్ పోలీస్ హోసింగ్ కాలనీ , రాధాకృష్ణ నగర్ ,శ్రీనగర్ కాలనీ పార్ట్ …జనరల్ మహిళ
13 .డివిజన్ శ్రీనగర్ కాలనీ …………………………………………………….. జనరల్
14 డివిజన్ గోపాలపురం, గొల్లగూడెం , మధురానగర్ , సాయినగర్ ,కొత్తగూడం …బిసి జనరల్
15 .డివిజన్ రుద్రంకోట ,పుట్టకోట , కొత్తగూడం పార్ట్, అల్లిపురం …………………………జనరల్ మహిళ
16 . డివిజన్ కొత్తూరు అగ్రహారం ,ధంసలాపురం కాలనీ , కొత్త కాలనీ , శ్రీరాంనగర్ పార్ట్ …బిసి జనరల్
17 . డివిజన్ శ్రీనివాస్ నగర్ ,బెస్త కాలనీ , టీచర్ కాలనీ ,కాల్వకట్ట ……. జనరల్ మహిళ
18 డివిజన్ బొమ్మ పెట్రోల్ పంప్ , శ్రీరాంనగర్ పార్ట్ , శ్రీరాంహిల్స్ జనరల్ మహిళ
19 డివిజన్ .సంభాని నగర్ , పరిముక్కల కాలనీ ,శ్రీరాంనగర్ పార్ట్ , పార్శీభంధం …బిసి జనరల్
20 డివిజన్ మమతా హాస్పటల్,రామచంద్రయ్య నగర్ , హార్వెస్ట్ స్కూల్ …………బిసి జనరల్
21 డివిజన్ పాకబండ , పార్శీబంధం ,మాణిక్యానగర్ ,శాంతినగర్ , ….. . . జనరల్ మహిళ
22 డివిజన్ బిసి హాస్టల్ లుంబిని స్కూల్ ,మిషన్ హాస్పటల్ , ముస్తఫానగర్ ,గణేష్ టెంపుల్ , పార్శీభంధం పార్ట్ ………….ఎస్ సి మహిళ
23 డివిజన్ ముస్తఫానగర్ ,పోలీస్ లైన్ ,శాంతినగర్ , విద్యానగర్ ,మిషన్ హాస్పటల్ ప్రాంతం … జనరల్
24 డివిజన్ గణేష్ టెంపుల్ పార్ట్ ,మిషన్ హాస్పటల్ పార్ట్ శాంతినగర్ పార్ట్ , చర్చకాపౌండ్ ,మిషన్ హాస్పటల్ వెనక భాగం …………………………………… బిసి జనరల్
25 డివిజన్ కుమ్మరి బజార్ ,అద్దంకివారి వీధి , ………………….బిసి జనరల్
26 డివిజన్ బాహ్మణ బజార్ ,రాజకవీధి , ఎస్పీ ఆఫీస్ రోడ్ , చర్చి బజార్ , సుగ్గలవారి తోట …జనరల్
27 డివిజన్ అయ్యప్ప ఆలయం రోడ్, పోలీస్ లైన్ , ప్రకాశనగర్ ,టీచర్ కాలనీ పాత శ్రీనివాస్ నగర్ , అంబెడ్కర్ విగ్రహం ప్రాంతం …..జనరల్
28. డివిజన్. శ్రీనివాస్ నగర్ పార్ట్ ,పోలీస్ లైన్ , ప్రకాశనగర్ పార్ట్ ………………బిసి మహిళ
29 డివిజన్ సుందరయ్య నగర్,ఎఫ్ సి ఐ రోడ్ ,బిజ్జల వారితోట, ఎస్ సి కాలనీ, ఎరుకలవాడ ……………….బిసి మహిళ
30 డివిజన్ సుందరయ్య నగర్ పార్ట్ ,పంపింగ్ వెల్ రోడ్ ,సన్ రోజ్ స్కూల్ , ప్రాంతం …. బిసి మహిళ
31 డివిజన్ జహీర్ పుర , కాల్వకట్ట ,బోస్ కూడలి ,వడ్డెర కాలనీ ,…………… బిసి జనరల్ ,
32 డివిజన్ నర్తకి థియేటర్ ప్రాంతం లంబాడి తండా జమలాపురం పార్క్ ,ఎస్సీ కాలనీ , ఎస్టీ మహిళ
33 డివిజన్ గణేష్ నగర్ ,గాంధీనగర్ ,పంపింగ్ వెల్ రోడ్ …… ,,,,,,,,,,,,బిసి మహిళ
34 డివిజన్ గ్యాస్ గౌడౌన్ ప్రాంతం ,రంగనాయకుల గుట్ట , పిల్లి చిన్న కృష్ణ తోట, పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతం సుందరయ్య నగర్ ………………………బిసి మహిళ
35 డివిజన్ మోతీనగర్ అంబెడ్కర్ నగర్ ట్రంక్ రోడ్ , గ్యాస్ గౌడౌన్ పార్ట్ ….. జనరల్
36 డివిజన్ కలెక్టర్ బంగ్లా ప్రాంతం ,రాజకవీధి ,మోహన్ రోడ్ ,డాబాల బజార్ …. జనరల్
37 డివిజన్ అజిజ్ గల్లీ ,కమాన్ బజార్ , తాజ్ బేకరీ ప్రాంతం , హనుమాన్ టెంపుల్ రోడ్ , పెంటగడ్డ బజార్ , ……..జనరల్ మహిళ
38 డివిజన్ బి కె బజార్ ,ఖిల్లా ప్రాంతం ,…………………… బిసి మహిళ
39 డివిజన్ నిజం పేట విజ్ఞాన్ స్కూల్ ప్రాంతం,హనుమాన్ టెంపుల్ ఎదురు వీధి … జనరల్
40 డివిజన్ కటిక బజార్ , రాతి దర్వాజా మోమినన్ స్కూల్ ,ఆదిత్య థియటర్ ప్రాంతం ,హనుమాన్ టెంపుల్ బజార్ పార్ట్ ……ఎస్సీ జనరల్
41 డివిజన్ కవిరాజ నగర్ ,కలెక్టరేట్ ,జడ్పీ ,పాత టూ టౌన్ పోలీస్ స్టేషన్ ,సిక్వెల్ ప్రాంతం ,జ్యోతి బలమందిర్ ప్రాంతం ,తుమ్మల గడ్డ రజాకవీధి …………………జనరల్
42 డివిజన్ బి కె బజార్ పార్ట్ ,మోమినన్ బజార్ పార్ట్ ,ఖిల్లా ఏరియా పార్ట్ ,నిజం పేట ,జమ్మిబండ పార్ట్ ….. ……………….ఎస్సీ మహిళ
43 డివిజన్ ఎన్ ఎస్ టి దేవాలయం ప్రాంతం ,కవిత కళాశాల వెనక ప్రాంతం , ప్రభుత్వ హాస్పటల్ ప్రాంతం ………………………ఎస్సీ జనరల్
44 డివిజన్ లెనిన్ నగర్ ,ఆసాధారణ్ హాస్పటల్ ప్రాంతం ,ఎన్ ఎస్ సి రోడ్ పార్ట్ ,పెవిలియన్ గ్రౌండ్ వెనక భాగం బస్ డిపో ప్రాంతం ……………బిసి జనరల్
45 డివిజన్ మామిళ్ళ గూడెం ,డి ఆర్ యస్ కళాశాల ప్రాంతం ,వివేకానంద పాఠశాల ,బొమ్మన కూడలి…………………………………… జనరల్ ,
46 డివిజన్ సారధీనగర్ ట్రంక్ రోడ్ , డీమర్ట్ ,గొల్లబజార్ ,కలెక్టర్ క్యాంపు కార్యాలయం ప్రాంతం ………………….బిసి మహిళ
47 డివిజన్ వెంకటేశ్వర నగర్ ,కనకదుర్గ దేవాలయం రోడ్ , నయాబజార్ స్కూల్ ప్రాంతం, బొక్కల గడ్డ ………………………………. బిసి మహిళ
48 డివిజన్ గణేష్ నగర్ ,మేకల నారాయణ నగర్ , పద్మావతి నగర్ ,సారధీనగర్ పార్ట్ ,సాయిబాబా టెంపుల్ వీధి, వేంకటేశ్వరనగర్ పార్ట్ ………………………బిసి మహిళ
49 డివిజన్ గాయత్రీ భవన్ ప్రాంతం,మొండి గేట్ , ఎస్ జి బ్యాంకు ప్రాంతం,వెంకటేశ్వర్ కాలనీ ,మామిళ్లగూడెం పార్ట్ ,మాంటిసోరి పాఠశాల ప్రాంతం , …………………..జనరల్
50 డివిజన్ నిర్మల్ హృదయ్ పాఠశాల ,కాల్వకట్ట ,మామిళ్లగూడం ప్రభుత్వ పాఠశాల ప్రాంతం,ఆర్టీసీ కాలనీ , ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ ఆఫీస్ ప్రాంతం , డి ఆర్ డి ఏ ఎదురు ప్రాంతం , ………………………………..జనరల్
51 డివిజన్ బుర్హాన్ పురం పార్ట్ ,నేతాజీ నగర్ ,హనుమాన్ టెంపుల్ రోడ్ ,24 గంటల పంపు ప్రాంతం ,వడ్డెర కాలనీ …………………….బిసి జనరల్
52 డివిజన్ బుర్హాన్ పురం పార్ట్ ,ఎన్ ఎస్ పి ప్రాంతం ,రిక్కా బజార్ స్కూల్ ప్రాంతం సరితా క్లినిక్ ప్రాంతం బుర్హాన్ పురం ప్రభుత్వ పాఠశాల ప్రాంతం ………………….ఎస్సీ జనరల్
53 డివిజన్ కవిత పీజీ కళాశాల ప్రాంతం ,బోడేపూడి విగ్రహం ప్రాంతం ,ఎన్ ఎస్ టి దేవాలయం వెనక భాగం, సహకార నగర్ ఎన్ ఎస్ పి క్యాంపు ,అంబెడ్కర్ గురుకుల పాఠశాల ప్రాంతం జాన్సన్ కిడ్స్ స్కూల్ ప్రాంతం ,బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ప్రాంతం ……………………జనరల్ మహిళ
54 డివిజన్ వీడియోస్ కాలనీ శ్రీకృష్ణ నగర్ ,ఏ సి పి కార్యాలయం ప్రాంతం ……………జనరల్ మహిళ
55 డివిజన్ బ్యాంకు కాలనీ, రాజీవగంజ్ ,వేణుగోపాల్ నగర్ పార్ట్ , వి వి సి పాఠశాల ప్రాంతం ……………………….జనరల్ మహిళ
56 డివిజన్ విజయనగర్ కాలనీ పార్ట్ ,ద్వారకానగర్ ,వేణుగోపాల్ నగర్ పార్ట్ …………..జనరల్ మహిళ
57 డివిజన్ వికలాంగుల కాలనీ శ్రీరామగిరి ,రమణ గుట్ట , లంబాడి కాలనీ హనుమాన్ నగర్ ,జగజ్జివన్ రామ్ నగర్ ………………బిసి మహిళ
58 డివిజన్ రమణ గుట్ట ,దొరన్న కాలనీ ,రాపర్తి నగర్ ,బిసి కాలనీ ,కరంట్ ఆఫీస్ ప్రాంతం ………….. జనరల్ మహిళ
59 డివిజన్ దానాయాయి గూడెం ……………………………… ఎస్సీ మహిళ
60 డివిజన్ రామన్నపేట …………………………………………..ఎస్సీ జనరల్