Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

షర్మిల దీక్ష భగ్నం … పోలిసుల తోపులాట , చిరిగిన దుస్తులు ఒంటికి దెబ్బలు కంట కన్నీరు

షర్మిల దీక్ష భగ్నం … కంట కన్నీరు
-తోపులాటలో చిరిగిపోయిన షర్మిల దుస్తులు
-ఒంటికి గాయాలు …విజయమ్మ కూడా పక్కనే
-ఉద్రికత్త అరెస్ట్ బేగం పేట మహిళా పోలీస్ స్టేషన్ కు తరలింపు
– పోలిసుల మిస్ బివేవియర్ పై ఆగ్రహం
-జులై 8 న పార్టీ ప్రకటిస్తా ఆ రోజే పాదయాత్ర తేదీని ప్రకటిస్తా
-నిరుద్యోగులు నాకు అండగా ఉండండి
నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని కోరుతూ ఇందిరా పార్క్ దగ్గర ఒక రోజు దీక్ష చేపట్టిన షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కేవలం 7 గంటల వరకే దీక్ష చేసిన తరువాత విరమించాలని కోరారు .అందుకు అంగీకరించిన షర్మిల పాదయాత్రగా లోటస్ పాండ్ కు వెళ్లి అక్కడ మూడు రోజులు దీక్ష చేయాలనీ పాదయాత్రగా బయలు దేరారు. దీంతో తెలుగు తల్లి ప్లే ఓవర్ వద్దకు రాగానే పోలీసులు షర్మిలను అడ్డగించారు. తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తలనడుమ ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె దుస్తులు చిరిగి పోయాయి.వంటికి గాయాలు అయ్యాయి . ఆమె చేతికి గాయం కావడంతో కట్టు వేశారు. షర్మిలను బలవంతంగా పోలీస్ వాహనం లో ఎక్కించి బేగంపేటకు తరలించారు.అంతకు ముందు ఆమె మీడియా తో మాట్లాడుతూ తనకు జరిగిన అవమానంపై కన్నీరు పెట్టారు.దీక్ష చేయటానికి అనుమతి ఇచ్చి నిరాకరించటం ఏమిటని ప్రశ్నించారు. నిరుద్యోగి సునీల్ ఆత్మహత్య కలిచివేసిందన్నారు. సునీల్ హాస్పటల్ లో ఉన్నప్పుడు ఆయన బ్రతకాలని ప్రార్దించానని కన్నీటి పరవంతమైయ్యారు . సునీల్ చనిపోతే ఆయన అన్నకు ఉద్యోగం ఇస్తానని అన్నారు. ఇచ్చారా ? అని ఆరా తీస్తే లేదక్కా అని సునీల్ అన్న చెప్పాడని అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం తనని కలిచి వేసిందన్నారు. కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు ఉన్నాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. సునీల్ తన సూసైడ్ నోట్ లో తాను పిరికి తనంతో చనిపోవడం లేదని చావు అయినా నిరుద్యోగుల ఉద్యమానికి ఊపిరులూదాలని కోరుకున్నారు. అని పేర్కొన్నారు. ఆమె దుఃఖం ఆగలేదు. తాను పాదయాత్ర ను అడ్డుకోవడం ఏమిటి నేను ఇంట్లో నే నిరాహార దీక్ష చేస్తా , నాకు ఏమైనా జరిగితే అభిమానులు ఊరుకోరని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related posts

తెలంగాణ బీజేపీ నేతలతో నడ్డా సమావేశం… క్రమశిక్షణపై క్లాస్!

Drukpadam

Here Are 5 Ways You Can Get Younger-looking Skin Right Now

Drukpadam

ఖమ్మంకు కాంగ్రెస్ అతిరథ మహారధులు

Drukpadam

Leave a Comment