Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం కార్పొరేషన్ లో గులాబీకి ప్రత్యాన్మాయం ఉందా?

ఖమ్మం కార్పొరేషన్ లో గులాబీకి ప్రత్యాన్మాయం ఉందా?
– పోటీపడే సత్తా ఉన్న పార్టీ ఏది ?
– టీఆర్ యస్ జెండా ఎగరటం ఖాయమేనా ?
– అన్ని తానై వ్యవహరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్
-కాంగ్రెస్ కు నాయకత్వ సమస్య … బలహీనపడ్డ వామపక్షలు
-అభివృద్దే అజెండాగా దూసుకు పోతున్న టీఆర్ యస్
-రూపురేఖలు మారిన ఖమ్మం
ఖమ్మం కార్పొరేషన్ లో గులాబీకి ప్రత్యాన్మాయం ఉందా? అసలు పోటీ పడే సత్తా ఉన్న పార్టీ ఏది ? అంటే కంచు కాగడా పెట్టి ఎతికిన కనిపించటంలేదు. సమీపంలో ఉన్న పార్టీ కూడా కనిపించటంలేదు. ఇది టీఆర్ యస్ మీదనో , లేక మంత్రి అజయ్ మీదనో ప్రేమతో చెబుతున్న మాట కాదు . ఖమ్మం లో కంటికి కనిపిస్తున్న వాస్తవం . గతంలో బలంగా ఉన్న సిపిఎం ఉనికి కోసం పాకులాడుతుంది. సిపిఐ గతంలోనూ ఇప్పుడు అంత బలమైంది కాదు. పైగా ఈ రెండు పార్టీలు టీఆర్ యస్ తో పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరుగుతుంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ యస్ ను సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వామపక్షలు ఎవరి మీద యుద్ధం చేయబోతున్నాయనేది ఆశక్తికరంగా మారింది. బీజేపీ ఖమ్మం లో పెద్దగా పట్టున్న పార్టీ కాదు . కేంద్రంలో అధికారంలో ఉన్నదనే అభిప్రాయంతో కొందరు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. అభివృద్ధి ఎజెండా కన్నా మతం ,కులం ప్రాతిపదికనే ఆపార్టీ కేంద్రీకరించటం తో ముందు కొంత మొగ్గుచూపిన వాళ్ళ సైతం వెకడుగు వేస్తున్నారు. బీజేపీ గ్రాఫ్ ఎందుకో తగ్గుతున్నట్లు కనపడుతుంది. అందువల్ల ఖమ్మం నగరంలో టీఆర్ యస్ కు ప్రత్యాన్మాయ పార్టీ లేదనేది జరుగుతున్న చర్చ . దీంతో ఖమ్మం ఖిల్లాపై రెండవసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమేనా ?అభివృద్దే అజెండాగా దూసుకుపోతున్న టీఆర్ యస్ కు బ్రేకులు వేయడం కష్టమేనా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ….

ఖమ్మం రూపురేఖలు మారాయి. … ఇది ఎవరు కాదన్నా కళ్ళముందు కనిపిస్తున్న నగ్న సత్యం …. స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా తనకు వచ్చిన అవకాశాన్ని ఖమ్మం అభివృద్ధిపై కేంద్రీకరించి వందల కోట్లతో అభివృద్ధి చేసి చూపించారు మంత్రి. అభివృద్ధి కోసం తమకు ఓట్లు వేయాలని టీఆర్ యస్ అడుగుతుంది .అభివృద్ధిలో అన్ని తానై మంత్రి అజయ్ వ్యవహరిస్తున్నారు. ఖమ్మం అభివృద్ధిపై ప్రణాళిక ఈనాటిది కాదు ఆయన ఎమ్మెల్యే అయినా దగ్గరనుంచి పక్క ప్లాన్ తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. మంత్రిగా మరిన్ని ఆవకాశాలు ఆయనకు వచ్చాయి. అందువల్ల ఖమ్మం కార్పొరేషన్ లో గులాబీకి ప్రత్యాన్మాయం లేదనే చెప్పాలి . కాంగ్రెస్ కు కొంత ఓటింగ్ ఉన్న అజయ్ ని ఢీకొట్టగలిగే దమ్మున్న నాయకుడు ప్రజలకు కనిపించటంలేదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.మంత్రి లో కొన్ని లోపాలు ఉన్న అభివృద్ధి ముందు అవి దిగదుడుపుగానే ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు.

అభివృద్ధిలో ఆయన పట్టుదలకు టి హబ్ , ఖమ్మం నూతన బస్ స్టేషన్ , లకారం లేక్ , వాకింగ్ పారడైజ్ , రోడ్ల వెడల్పు సెంట్రల్ లైటింగ్ , అధునాతన టాయిలెట్లు , ధంసలాపురం రైల్ ఓవర్ బ్రిడ్జి, ముస్తఫా నగర్ జంక్షన్ , అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు , జడ్పీ సెంటర్లో 14 అడుగుల రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బి ఆర్ అంబెడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు నిదర్శలుగా ఉన్నాయి. కొందరికి ఇవి చిన్నవిగానే కనిపించవచ్చు కాని సామాన్యుల దృష్టిలో ఇంతకన్నా పెద్దగా ఏమి కోరుకుంటారు. పేదలకోసం చేపట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం చెప్పినంత స్పీడ్ గా లేకపోయినప్పటికీ పట్టుదలతో ఎక్కువ ఇళ్లను కట్టించేందుకు ఆయన సిన్సియర్ గా కృషిచేస్తున్నారు . ఇంకా ఖమ్మం ను మరింత అభివృద్ధి చేయాలనే తపన ఆయనలో ఉంది.అందుకోసం నిరంతరం తపిస్తున్నారు. ప్రకాష్ నగర్ వద్ద చెక్ డాం కడుతున్నారు . మునేరు పక్కన అందమైన పార్క్ ను ఏర్పాటు చేయాలనీ ఖమ్మం నగర వాసులకు స్వేద తీరే ప్రదేశంగా దాన్ని తీర్చి దిద్దాలని ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలోనే ఉందని పలుమార్లు మంత్రి అజయ్ చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు పైపై అభివృద్ధి తప్ప ప్రజల మౌలిక సమస్యలు పరిస్కారం లో శ్రద్ద లేదని విమర్శలు చేస్తున్నాయి. రోడ్లు , తాగునీరు . చెక్ డాం లు , డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు , ప్రజలకు ఆహ్లద కరమైన వాతావరణం కల్పించడం అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం కాక మరేమిటని మంత్రి ప్రశ్నిస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఖమ్మం అభివృద్ధిలో తన దారి రహదారే అంటున్నారు మంత్రి అజయ్ . అందువల్ల ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. గెలుపు ఎవరిదీ అనే చర్చ కూడా లేదు .టీఆర్ యస్ మొత్తం డివిజన్లు గెలుస్తుందా ?లేదా ? ఎన్ని డివిజన్లు గెలుస్తుంది. గతంలో ఉన్న డివిజన్లు ప్రతిపక్షాలు దక్కించుకుంటాయా లేదా ? అనే దానిపై ఆశక్తి నెలకొన్నది .

 

Related posts

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌!

Drukpadam

తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీలకు అరుదైన గౌరవం…

Drukpadam

పోలవరం వయా భద్రాచలం …నారా లోకేష్ పర్యటన…

Drukpadam

Leave a Comment