Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి లడ్డు ధర 60 .8 లక్షలు …రికార్డు లను చెరిపేసి రిచ్ మండి విల్లాస్!

వినాయకుడి లడ్డు ధర 60 .8 లక్షలు …రికార్డు లను చెరిపేసి రిచ్ మండి విల్లాస్!
-హైదరాబాద్ రిచ్ మండ్ విల్లాస్ లో రికార్డు స్థాయిలో ధర పలికిన గణేశ్ లడ్డూ
-తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు
-నిన్న ఆల్వాల్ లో రూ.46 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
-ఇవాళ ఆ రికార్డు బద్దలు
-సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్ లడ్డూకు అదిరిపోయే ధర

వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న విగ్రహాలు , మండపాలు కుంకుమ పూజలు , అన్నదానాలు హోమాలు , చేయటం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో పూజలు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంటాయి. దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటారు . ఇది ఒక ఎత్తు అయితే చివరి రోజున లడ్డు వేలం పాట మరో ఎత్తు …..ఉభయ రాష్ట్రాల్లో సైతం బాలాపూర్ లడ్డు ధర ఇప్పటివరకు అత్యధికంగా ఉండగా ఈ ఏడాది బాలాపూర్ లడ్డు 24 లక్షలు పలికింది. ఇదే పెద్ద ధర అనుకున్నారు ,కానీ ఇదే హైద్రాబాద్ లోని అల్వాల్ లో లడ్డు ధర ఒక్క రూపాయ తక్కువ 46 లక్షలకు సొంతం చేసుకున్నారు .రిచ్ మండి విల్లాస్ లో ఈ రికార్డు లను తిరగరాస్తూ 60 .80 లక్షలు పలకడం కొత్త రికార్డు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ లడ్డూ వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. నిన్న ఆల్వాల్ లో మరకత వినాయకుడి లడ్డూ వేలం వేయగా రూ.46 లక్షలతో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. ఇప్పుడా రికార్డు కూడా బద్దలైంది. హైదరాబాద్ సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాస్ లో గణేశ్ లడ్డూ వేలం వేయగా, రికార్డు స్థాయిలో రూ.60.80 లక్షల ధర పలికింది.

దాంతో ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తెరమరుగయ్యాయి. ఏపీ, తెలంగాణలో మరే గణేశ్ మండపం వద్ద కూడా స్వామివారి లడ్డూకు ఇంత ధర పలకలేదు. సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్ లో ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ లడ్డూ వేలం నిర్వహించారు.

Related posts

ఖమ్మం ఐ ఎం ఎ ఆధ్వర్యంలో టెలిమెడిసిన్ -అందుబాటులో 31 మంది డాక్టర్లు

Drukpadam

విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Drukpadam

సుప్రీం తీర్పు వచ్చేవరకు కవిత విచారణకు వెళ్ళరు …లాయర్ భరత్!

Drukpadam

Leave a Comment