ఎ బి వెంకటేశ్వరరావు పై చర్యలకు ఏపీ సర్కార్ నిర్ణయం
-ప్రభుత్వ అధికారిగా ఉండి లక్ష్మణ రేఖ దాటారంటున్న ప్రభుత్వం
-డీజీపీ తో సహా ఇతర అధికారులపై సిబిఐ కి లేఖ
-విచారణ బహిర్గతం చేశారని వాఖ్య
ఒక భాద్యత గల అధికారి వ్యవహరించే తీరు ఇదేనా ?
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ఎ బి వెంకటేశ్వరరావు పై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది . ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వ విషయాలను విచారణను బహిర్గతం చేయటం లక్ష్మణ రేఖ దాటినట్లుగా భావించిన ప్రభుత్వం ఆయన పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర డి జి పి గౌతమ్ సవాంగ్ మీద ఇతర పోలీస్ అధికారుల మీద సిబిఐ కి లేఖ రాయడాన్ని ప్రభుత్వం తప్పు పట్టింది . భాద్యత గల అధికారిగా ఉండి ఆయన ప్రభుత్వానికి తెలియకుండా లేఖ రాయడం క్రమశిక్షణ చర్యకిందకే వస్తుందని పేర్కొన్నది . వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఉన్నత అధికారిక ఉండి ఎ బి వెంకటేశ్వరరావు ఎందుకు చర్యలు తీసుకోలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై డి ఐ జి అధికారిగా ఉన్న పాల్ రాజ్ మీడియా సమావేశంలో అప్పటి కడప ఎస్పీ గా ఉన్న రాహుల్ దేవ్ వర్మ ను వైయస్ కుటుంబ సభ్యులను , బంధువులను అరెస్ట్ చేయమని వత్తిడి తెచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. మీడియా సమావేశంలో రాహుల్ దేవ్ వర్మ కూడా పాల్గొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులపై వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పోలీసు విభాగం ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఏబీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. విచారణను బహిర్గతం చేసేలా ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొంది. 30 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది. వివేకా హత్యకేసులో ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల సీబీఐకి లేఖ రాశారు. తన లేఖలో డీజీపీపైనా, ఇతర పోలీసు అధికారులపైనా వ్యాఖ్యలు చేశారు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
–