Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

డెమొక్రటిక్ అజాద్ పార్టీ పేరుతొ గులాంనబీ ఆజాద్ కొత్త కుంపటి …!

కొత్త పార్టీ పేరును ప్రకటించిన గులాంనబీ అజాద్..!

  • డెమొక్రటిక్ అజాద్ పార్టీగా నామకరణం
  • ప్రజాస్వామ్య పార్టీగా ఉంటుందని ప్రకటన
  • ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్య

కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన గులాంనబీ ఆజాద్ అనుకున్నట్లుగానే కొత్త కుంపటి పెట్టుకున్నారు.తన 50 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా కేంద్రమంత్రిగా అనేక పదవులు నిర్వహించారు . ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటానికి కొన్ని నెలల ముందువరకు,రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేతగా కూడా వ్యహరించారు.కాంగ్రెస్ లో అసమ్మతిని రాజేయడంలో ఆయన కీరోల్ ప్లే చేశారనే అభిప్రాయాలూ ఉన్నాయి. కాంగ్రెస్ లో గ్రూప్ 23 నేతల్లో ఆజాద్ ముఖ్యుడని చెబుతారు. చివరకు ఆయన పార్టీని వీడి డెమోక్రాటిక్ ఆజాద్ పేరుతొ కొత్త పార్టీని పెట్టారు . అది ఎంతవరకు సెక్సెస్ అవుతుందనేది చూడాలి …

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీకి రాజీనామా సమర్పించిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నేత గులాంనబీ అజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. డెమొక్రటిక్ అజాద్ పార్టీగా తన కొత్త పార్టీకి పేరును నిర్ణయించారు. పార్టీ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన సొంత పార్టీని స్థాపించినట్టయింది.

తమకంటూ స్వతంత్ర ఆలోచన, సిద్ధాంతాలు ఉంటాయని అజాద్ ప్రకటించారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అవుతుందన్నారు. ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసుకోవడం తదుపరి ప్రాధాన్యతగా చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చనీ, తమ రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతాయనీ అన్నారు.

నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికతో అజాద్ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. ‘‘ఇందులో పపుసు రంగు అన్నది సృజనాత్మకత, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. తెలుపు అన్నది శాంతికి చిహ్నం. నీలం రంగు స్వేచ్ఛ, ఊహలకు ప్రతిరూపం’’ అని అజాద్ పేర్కొన్నారు.

Related posts

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీతో ఇక తెగదెంపులేనా …?

Drukpadam

సరుకులపై జీఎస్టీ విధింపును తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్!

Drukpadam

పాకిస్థాన్​ తో చర్చలా.. అది అసలు జరగని పని.. : అమిత్​ షా

Drukpadam

Leave a Comment