Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై రాష్ట్రమంత్రి పువ్వాడ ఫైర్ …

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై రాష్ట్రమంత్రి పువ్వాడ ఫైర్ …
-బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు అన్న పువ్వాడ
-విభజన చట్టంలో ఫ్యాక్టరీ పెడతామని కేంద్రం హామీ ఇచ్చింది నిజంకాదా?
-భద్రాచలం లో ఏడూ మండలాలు …సీలేరు పవర్ ప్లాంట్ ఏపీకి దారాదత్తం చేయలేదా ??
-బయ్యారం ఫ్యాక్టరీ మీకు చేతకాకపోతే ఎప్పుడో చప్పాల్సి ఉంది
-రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏమి చేశారో చెప్పాలి …

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ..బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఆగ్రహం వ్యక్తం చేశారు.బయ్యారం ఉక్కు పరిశ్రమ పై చేసిన ప్రకటనకు నిరసనగా ఖమ్మం జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.

బయ్యారం అంశంపై కిషన్ రెడ్డి చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం వైఖరా స్పష్టం చేయాలని, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని అన్నారు.బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టం లో హామీ ఇచ్చిందని, ఎన్నో ఆందోళనల తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తామని హామీ వచ్చిందని స్పష్టం చేశారు.

భద్రాచలంలోని ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్లాంట్ లాక్కున్నారు, నవోదయ పాఠశాలలు, మెడికల్ కళాశాలకు తదితర విషయాలలో చేసిన ప్రకటనలు, హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు.బయ్యారం ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతామని విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా ఎందుకు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తాం.. ఇస్తాం అని గత ఎనిమిది ఏళ్ల నుండి కాలయాపన చేస్తున్నారని, మీకు చాత కాదు అని చెప్పాల్సి ఉండేది.. మేము చేసుకునే వారం అని అన్నారు.

దేశాన్ని పరిపాలించే శక్తి, యుక్తి లేని కేంద్ర ప్రభుత్వం కేవలం వ్యవస్థలను వాడుకుని దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజం ఎత్తరు.మెక్ ఇన్ ఇండియా నినాదంతో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చెయ్యడం సిగ్గుచేటన్నారు .

కిషన్ రెడ్డి ప్రకటన తెలంగాణ పై పిడుగు పాటు లాంటిదని, ఆయన తీరు చూస్తుంటే ఆయన తెలంగాణ లోనే పుట్టారా అనే అనుమానం కలుగుతోందన్నారు.తెలంగాణలో కిషన్ రెడ్డి ప్రతి అంశంలో అవగాహన లేకుండా మాట్లాడుతారని, కేంద్ర మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి తెలంగాణ కు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు.

ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు పై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచారో అది అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందన్నారు. బీజేపీ నేతలకు తమ సొంత పనుల పై ఉన్న శ్రద్ధ తెలంగాణకు మేలు చేయడంలో లేదని, బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీకి అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణుల కమిటీ గతంలోనే చెప్పిందని వివరించారు

ప్రజల్లో తిరుగుబాటు రాక ముందే బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే అందుకు కార్యాచరణ చేస్తుందన్నారు. బయ్యారం ఉక్కు నాణ్యతపై ఉమ్మడి సర్వే కు సిద్ధంగా ఉన్నామని, గతంలోనే నిష్ణాతులు సర్వే చేశారని, నాణ్యమైన ఉక్కు అక్కడ ఉందని నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ఆ నివేదికను ప్రజల ముందు ఉంచాలని, లేదా పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.

ఎనిమిదేళ్ల తర్వాత బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టము అని కిషన్ రెడ్డి చావు కబురు చెబుతారా అని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి తన ప్రకటనతో తాను ఓ చేత కాని దద్దమ్మ అని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ పట్ల బీజేపీ కి చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి ప్రకటనతో రుజువైందన్నారు. కిషన్ రెడ్డి పర్యాటక మంత్రా లేక, స్టీల్ శాఖ మంత్రి ఆ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రులు టూరిస్టుల్లా వచ్చి పోతున్నారు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని, కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి కనీస సమాచారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉల్లంఘించారని, తెలంగాణకు కిషన్ రెడ్డి లాంటి ఉత్సవ విగ్రహాలు అవసరం లేదన్నారు.

బయ్యారంలో నీళ్లు ఉన్నాయి, రవాణా వ్యవస్థ బాగుంది, ముడి ఉక్కు నిల్వలు ఉన్నాయి.. మరి ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరని అన్ని ఆర్గతలున్నా.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కి ఎందుకు నోచుకోదో చెప్పాలని అడుగుతున్నాను అన్నారు. తక్షణమే ఏపీ పునర్విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

అనంతరం తెరాస జిల్లా పార్టీ అధ్వర్యంలో గట్టయ్యా సెంటర్ కార్యాలయం ఎదుట మోడీ, కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు..

కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు , మేయర్ పునుకొల్లు నీరజ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , సుడా చైర్మన్ విజయ్ , డిప్యూటీ మేయర్ ఫాతిమా , తెరాస నగర అధ్యక్షడు పగడాల నాగరాజు , మాజి ఎమ్మేల్యే చంద్రావతి , కార్పొరేటర్ లు ఉన్నారు.

Related posts

బీజేపీ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడిని ఖండించిన అమిత్ షా!

Drukpadam

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసిన జ‌గ‌దీప్ ధన్‌ఖడ్‌… 

Drukpadam

దళితబంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టం: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment