Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దళిత జర్నలిస్టులందరికీ ,దళిత బంధు ఇవ్వాలి…

దళిత జర్నలిస్టులందరికీ ,దళిత బంధు ఇవ్వాలి…
-మంత్రి పువ్వాడకు టి. యు డబ్ల్యూ. జె (ఐజేయు) వినతి.
-ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులందరికి పధకం వర్తించేవిధంగా మంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
-సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దళిత జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకమును మొదటి విడతలోనే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని టి యు డబ్ల్యూ జె (ఐజేయు) జిల్లా కమిటీ మంగళవారం నాడు ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసింది . ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈపథకం జర్నలిస్టులకు అమలయ్యేందుకు చొరవతీసుకోవాలని యూనియన్ నేతలు మంత్రిని విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి పువ్వాడ అజయ్ సానుకూలంగా స్పందించారు.ప్రధానంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దళిత జర్నలిస్టులు అందరికి తొలివిడతలోనే ఈ పథకం అందించాలని ప్రత్యేకంగా మంత్రికి విన్నవించడం జరిగింది.

అంతకుముందు టి యు డబ్ల్యూ జె (ఐజేయు) సారధ్యంలో ఏర్పాటుచేసిన దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రెస్క్లబ్ లో జరిగిన సమావేశంలో దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు పథకాన్ని మొదటి దశలోనే అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జె ( ఐజె యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకటరావు ,టియుడబ్ల్యు జె (ఐ.జె.యు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు మైస పాపారావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, దళిత బంధు సాధన కమిటీ కన్వీనర్ కనకం సైదులు, కో కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్,తో పాటు టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా నాయకులు యెగి నాటి మాధవరావు, గోపాల్ రావు కే శ్రీనివాస్, నామ పురుషోత్తం, మేడి రమేష్ , భాస్కర్, ఖమ్మం టీవీ శ్రీనివాస్, కొమిరే నాగేశ్వరరావు, టెన్ టీవీ రాంబాబు, సుధాకర్ ,విజయ్, ఏబీఎన్ సైదులు మనం శ్రీనివాస్, మందుల ఉపేందర్ సునీల్, వెంకటరమణ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వంట నూనె ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి.. ఏపీ సహా 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు…

Drukpadam

100 రూపాయల నోట్ పై ఎన్టీఆర్ ఫోటో పెట్టె ప్రతిపాదన ఏది లేదు …ఆర్బీఐ స్పష్టికరణ !

Drukpadam

పాద యాత్రలో సాధారణ జీవితం: బండి సంజయ్

Drukpadam

Leave a Comment