Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కత్తిమీద సాముగా…కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక…

కత్తిమీదసాముగా మారిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ….
-సోనియా ,రాహుల్ మాటలు లెక్కచేయని నేతలు
-రాజస్థాన్ సీఎం ఫీఠం వదులుకోనని తేల్చి చెప్పిన గేహలోట్
-తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గేహలోట్
-రంగంలో డిగ్గీరాజా ,శశిథరూర్
-పోరు తప్పేట్లు లేదు …తమది స్నేహపూర్వక పోటీ అంటున్న శశిథరూర్

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ వీడింది. రేసులో ఎవరు తుది వరకు నిలుస్తారనే అనుమానాల నడుమ.డిగ్గీరాజా , శశిథరూర్. ద్విముఖ పోటీ ఖరారు అయ్యింది . అయితే ఇది కత్తి మీదసాములా మారింది. నమ్మకస్తులుగా ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో గట్టెంక్కించేందుకు సిద్దపడకపోవడం , గాంధీ కుటుంబాన్ని కలవరపెడుతుంది. ఇవాళ అశోక్‌ గెహ్లాట్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. దిగ్విజయ్‌ సింగ్‌ బరిలో నిలిచినట్లు ప్రకటించారు.దీంతో డిగ్గీరాజా , శశిథరూర్ లమధ్య పోటీ అనివార్యమైంది.

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న్టట్లు అధికారికంగా ప్రకటించారు సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. తొలుత పోటీ విషయంలో ఊగిసలాట ప్రదర్శించిన ఆయన.. ఇవాళ(గురువారం) నామినేషన్‌ ఫామ్‌లు తీసుకున్నారు. అనంతరం మీడియాకు ఆ విషయాన్ని తెలియజేశారు. అవును.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. అందుకు సంబంధించిన నామినేషన్‌ పత్రాలివే అని ఆయన చూపించారు. అనంతరం ఆయన సోనియా గాంధీ నివాసానికి వెళ్లి.. కాసేపు చర్చించారు.

ఇక మరో సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ ఇదివరకే నామినేషన్‌ పత్రాలను తీసుకున్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు చివరి రోజైన రేపు(సెప్టెంబర్‌ 30న).. ఈ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, అశోక్‌ గెహ్లాట్‌.. పోటీ నుంచి తప్పుకున్నారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన వివరాలను వెల్లడించారు. జరిగిన పరిణామాలపై అధిష్టానానికి క్షమాపణ చెప్పినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌-దిగ్విజయ్‌సింగ్‌ మధ్యే పోటీ ఉంటుందని గెహ్లాట్‌ ప్రకటించారు. 

అశోక్‌ గెహ్లాట్‌.. అధిష్టానానికి ఇష్టుడిగా బరిలో దిగుతారని అంతా భావించారు. దీంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావొచ్చనే చర్చ నడిచింది. అయితే ఒక్క వ్యక్తి.. ఒక్క పదవి కారణంతో ఆయన తనకు నచ్చిన వ్యక్తిని రాజస్థాన్‌ సీఎం చేయాలని భావించగా.. సచిన్‌ పైలట్‌ పేరు తెర మీదకు రావడంతో ఎమ్మెల్యేల తిరుగుబాటు అక్కడి రాజకీయం కలకలం రేపింది. ఈ క్రమంలో.. పరిణామాలపై వివరణ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వివరణ కోరగా.. ఇవాళ ఆయన ఆమె నివాసంలో భేటీ అయ్యారు.

Related posts

ఓ హిందువు బ్రిటన్ ప్రధాని అయ్యాడు… మరి భారత్ లో ఓ ముస్లిం ప్రధాని అయ్యేనా?: శశి థరూర్!

Drukpadam

బద్వేల్ బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి …వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ!

Drukpadam

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి!

Drukpadam

Leave a Comment