ఏపీలో ఉపాధ్యాయుల విషయంలో హరీష్ రావు కామెంట్ …కౌంటర్ ఇచ్చిన బొత్స..
-ఏపీలో ఉపాధ్యాయులపట్ల ప్రభుత్వం కర్కశత్వంగా వ్యవహరిస్తోంది….హరీష్ రావు …
-లేదు…లేదు ..ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు …మంత్రి బొత్స
- -సిద్దిపేటలో జరిగిన ఉపాధ్యాయ సంఘం సమావేశానికి హాజరైన హరీశ్ రావు
- -ఐదేళ్ల కాలంలో 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణేనని వెల్లడి
- -ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి లోపల వేస్తున్నారని వ్యాఖ్య
- -ఉపాధ్యాయులపై ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందన్న హరీశ్ రావు
- -హరీశ్ వ్యాఖ్యలపై వేగంగా స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ
- -పీఆర్సీలను పరిశీలిస్తే తేడా తెలుస్తుందని వ్యాఖ్య
- -హరీశ్ రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు
ఏపీలో ఉపాధ్యాయుల పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సిద్ధిపేటలో ఉపాధ్యాయ సంఘం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వ కర్కశంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. అయితే తెలంగాణలో ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటోందని ఆయన అన్నారు. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెడుతున్న ప్రభుత్వం వారిని జైల్లో వేస్తోందని కూడా హరీశ్ రావు ఆరోపించారు.
ఐదేళ్ల కాలంలో ఉద్యోగులకు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణేనని హరీశ్ రావు అన్నారు. ఇంత మేర ఫిట్‌మెంట్ దేశంలో ఎక్కడైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే… తెలంగాణలో తమ ప్రభుత్వం ఉద్యోగులతో ఎంత ఫ్రెండ్లీగా ఉందన్న విషయం అర్థమవుతుందని
ఉపాధ్యాయులపై ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. వాస్తవాలేమిటో తెలుసుకోకుండా హరీశ్ రావు మాట్లాడటం సరికాదని బొత్స అన్నారు. ఈ మేరకు హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ బొత్స పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని బొత్స అన్నారు. హరీశ్ రావు ఒకసారి ఏపీకి రావాలని, ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ, ఏపీ పీఆర్సీలు పక్కపక్కనే పెట్టుకుని చూస్తే తేడా తెలుస్తుందని బొత్స వ్యాఖ్యానించారు. అయినా హరీశ్ రావు తమ ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చని బొత్స అన్నారు.