Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మీడియా కథనాల్లో విశ్వసనీయత కరవు: రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి

మీడియా కథనాల్లో విశ్వసనీయత కరవు
జస్టీస్ సుదర్శన్ రెడ్డి ఆవేదన

వార్తల్లో నైతిక విలువ‌ల‌కు స్థానంలేకుండా పోవ‌డం ప‌ట్ల‌ విచారకరం
వార్తలు, కథనాల ద్వారా పాలకులను మెప్పించడమే తమ బాధ్యత అన్నట్టుగా మీడియా సంస్థలు వ్యవహరించడం ఆందోళనకరం
రైతుల ఆత్మహత్యల వంటి ప్రధాన వార్తలకు మీడియా సరైన కవరేజి లేకుండా పోయిందని ఆవేదన
గ్రామీణ ప్రాంత వార్తలకు తక్కువ కవరేజ్
సంచలకోసం పాకులాడే మీడియా సంస్థలు …ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేవు

మీడియా క‌థ‌నాల్లో విశ్వ‌స‌నీయ‌త స‌న్న‌గిల్లుతోంద‌ని, వాస్త‌వాలు రాయాల‌న్న త‌ప‌న జ‌ర్న‌లిస్టుల్లో క‌నిపిస్తున్నా, మీడియా సంస్థ‌ల యాజ‌మాన్య‌ల్లో మాత్రం ఆ చిత్త‌శుద్ది లోపిస్తున్నదని సుప్రీంకోర్టు విశ్రాంత‌ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బి.సుద‌ర్శ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. స‌ర‌ళీకృత న‌వీన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో నైతిక విలువ‌ల‌కు స్థానంలేకుండా పోవ‌డం ప‌ట్ల‌ ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు.
ఇండియ‌న్ జ‌ర్నలిస్ట్స్‌ యూనియ‌న్ (ఐజేయూ) ప‌ద‌వ జాతీయ మ‌హాస‌భ‌ల నేప‌థ్యంలో శుక్ర‌వారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ ఆవ‌ర‌ణ‌లో ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన “ప్రింట్‌,ఎల‌క్ట్ర్రానిక్ మ‌రియు సోష‌ల్ మీడియా – నైతిక ప్ర‌మాణాలు” అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం(టీయూడ‌బ్య్లూజే), దాని అనుబంధ సంస్థలు, ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్ కు అయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
నైతిక విలువలు – పాత్రికేయ వృత్తి ఒకదానితో ఒకటి పొసగని పరిస్థితి ఏర్పడిందన్నారు. వార్తలు, కథనాల ద్వారా పాలకులను మెప్పించడమే తమ బాధ్యత అన్నట్టుగా మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని, అలా వ్యవహరించడం తప్పుకాదన్న ధోరణి ప్రభలడం దురదృష్టకరమని జస్టీస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యల వంటి ప్రధాన వార్తలకు మీడియా సరైన కవరేజి లేకుండా పోయిందని ఆయన వాపోయారు. ఎన్నికల సంవత్సరంలో గ్రామీణ వార్తలకు పత్రికల్లో మొదటి పేజీల్లో ఇస్తున్న కవరేజి 0 .67 శాతం ఉన్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైందని అంటూ.. ఎన్నికల హడావుడి లేని కాలంలో నైతే ఇంకా తక్కువ ప్రాధాన్యత లభిస్తుందని అయన ఆవేదన వ్యక్తం చేసారు. 2020 సంవత్సరం ప్రథమార్థంలో మహారాష్ట్రలో 2000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే మీడియా ఆ వార్తలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యకు సంబంధించిన కథనాలను పుంఖాను పుంఖాలుగా ఇస్తూ పరస్పరం పోటీ పడ్డాయని జస్టీస్ సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖా మాజీ అధిపతి పద్మజ షా మాట్లాడుతూ మీడియా నైతిక విలువల ఉల్లంఘన సర్వసాధారణమై పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రపంచ వ్యాప్తంగా మీడియా రంగంలో రూపర్ట్ మర్డోక్ ప్రవేశించిన తర్వాత అన్ని ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. నేడు అన్ని టెలివిజన్ సంస్థలు మర్డోక్ ఫార్ములాను పాటిస్తున్నాయని ఆమె తెలిపారు. దేశంలో నేడు మీడియా సంస్థలు ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా ప్రశ్నించే వారు, శిక్షించే వారే కరువయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. సంచనల కోసం పాకులాడే మీడియా సంస్థలు ఏనాటికి ప్రజల విశ్వసాన్ని చూరగొనలేవని పద్మజ షా స్పష్టం చేసారు.

విమర్శనాత్మక కథనాల్లో వాస్తవికత, నిజాయితీ ఉంటేనే ప్రజల విశ్వాసం సాధ్యమవుతుందని ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ సదస్సులో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మెఫీ) మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే .విరాహత్ అలీ, ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.వేణుగోపాల నాయుడు, ఆర్.రవికాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎస్.విజయకుమార్ రెడ్డి, తెలంగాణ చిన్న,మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ యూసుఫ్ బాబు, బాలకృష్ణ, హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్ (హెచ్.యు.జె ) అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగా శంకర్ గౌడ్, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హరీ, తెలంగాణా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏం.ఏ.మజీద్, గౌసొద్దీన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కోశాధికారి ఏ.రాజేష్, సహాయ కార్యదర్శి రమేష్ వైట్ల, టీయూడబ్ల్యూజే నాయకులు హబీబ్ జిలాని, బి.కిరణ్ కుమార్, మోతే వెంకట్ రెడ్డి, బాలరాజ్, వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ ఏడాది మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.4,98,799 కోట్లు:సీఎం ప్ర‌త్యేక కార్య‌దర్శి కృష్ణ‌!

Drukpadam

ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర నేతలు బండి, రఘునందన్

Drukpadam

జగన్ కు ఎక్కడ మంచి పేరొస్తుందోనని వారికి కడుపుమంట: సీఎం జగన్

Drukpadam

Leave a Comment