Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

థాయ్ లాండ్ లో మాజీ పోలీసు అధికారి కాల్పుల విధ్వంసం… 34 మంది బలి!

థాయ్ లాండ్ లో మాజీ పోలీసు అధికారి కాల్పుల విధ్వంసం… 34 మంది బలి!

  • నెత్తురోడిన బేబీ డే కేర్ సెంటర్
  • మృతుల్లో 22 మంది చిన్నారులు
  • ఘటన అనంతరం తనను తాను కాల్చుకున్న మాజీ పోలీసు

ఆసియా ఖండంలోని పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయిలాండ్ ఉద్యొగం నుంచి తొలగించబడిన ఒక పోలీస్ అధికారి తెగబడి జరిపిన కాల్పుల సంఘటనలో 34 మరణించడం కలకలం లేపింది. అందులో 23 మంది చిన్నారులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.దుండగుడు బాగా మద్యం సేవించి ఉన్నారని ,అతనిపై మోపబడిన నేరారోపణుల కేసులో శుక్రవారం కోర్ట్ కు హాజరు కావాల్సి ఉండగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

థాయ్ లాండ్ లో మాజీ పోలీసు అధికారి తుపాకీతో విలయం సృష్టించాడు. ఈశాన్య థాయ్ లాండ్ లోని ఓ బేబీ డే కేర్ సెంటర్ లో కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో 34 మంది మరణించారు. అందులో 22 మంది చిన్నారులే. కాగా, ఈ కాల్పుల ఘటన అనంతరం మాజీ పోలీసు అధికారి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో థాయ్ లాండ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇతర తూర్పు ఆగ్నేయాసియా దేశాలతో పోల్చితే థాయ్ లాండ్ లో వ్యక్తులు తుపాకులు కలిగి ఉండడం ఎక్కువ. అధికారిక గణాంకాల కంటే అక్రమ ఆయుధాల సంఖ్య ఎక్కువే ఉంటుంది.

థాయిలాండ్‌లోని ఓ ప్రీస్కూల్‌ వద్ద ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో కనీసం 34 మంది మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మృతుల్లో ఎక్కువ మంది స్కూల్ పిల్లలే కావడం గమనార్హం. మొత్తం 23 మంది పిల్లలు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

మృతుల్లో ఓ గర్భిణి మహిళ కూడా ఉన్నారు. ఈ మారణకాండ థాయిలాండ్‌ ఈశాన్య ప్రాంతం నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్‌బు నాలంపూ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. తుపాకీతో డే కేర్ సెంటర్‌లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అతడ్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే. నిందితుడు వారిపైనా కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడు పరారరయ్యాడు. కాల్పులకు పాల్పడిన అనంతరం నిందితుడు బ్యాంకాక్ రిజిస్ట్రేషన్ ఉన్న 4 డోర్ వీగో పికప్ ట్రక్ ఎక్కి పారిపోయాడు. దీంతో అతని కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు.

నిందితుడిని 34 ఏళ్ల పాన్య ఖమ్రాప్‌గా అనుమానిస్తున్నారు. నిందితుడు మాజీ పోలీసు అధికారి కావడం గమనార్హం. మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో అతడ్ని ఏడాది కిందటే పోలీసు విధుల నుంచి తొలగించారు. వాస్తవానికి అతడు శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.  కాగా, సాధారణంగా థాయిలాండ్ లో భారీ కాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. చివరిసారిగా 2020లో నఖోమా రాట్చెస్మా నగరంలో ఓ సైనికుడు కాల్పులు జరపడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.

అయితే అమెరికా తరహాలో థాయ్ లాండ్ లో విచ్చలవిడి కాల్పుల ఘటనలు చాలా అరుదు. 2020లో ఓ సైనికుడు ఓ ఆస్తి వివాదంలో ఆగ్రహం చెంది 29 మందిని కాల్చి చంపడం ఈ పర్యాటక దేశంలో సంచలనం సృష్టించింది.

Related posts

సింగరేణి కాలనీ లో సంఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం …నిందితున్ని కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరిక!

Drukpadam

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు పోలీసుల విఫలయత్నం!

Drukpadam

లిఫ్ట్ లో ఇరుక్కుని ఉపాధ్యాయిని మృతి!

Drukpadam

Leave a Comment