Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కరోనా ఎఫెక్ట్.. రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసిన షర్మిల

కరోనా ఎఫెక్ట్.. రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసిన షర్మిల
కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం
నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు దీక్షలు
ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
ఉద్యోగ నియామకాల కోసం వైయస్ షర్మిల ఆధ్వరంలో రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన రిలే దీక్షలను కరోనా కారణంగా వాయిదా వేశారు. దీక్షలవల్ల అనేక మంది అక్కడకు చేరటం ప్రస్తుత ప్రరిస్థితుల్లో మంచిది కాదని దీనివల్ల దీక్షలలో కూర్చున్నవారికి లేక సంఘీభావం తెలియజేసేందుకు వచ్చేవారికి ఇబ్బందు ఉంటుందనే ఉద్దేశం తోనే దీక్షలను వాయిదా వేసినప్పటికీ పోరాటం కొనసాగుతుందని షర్మిల అనుయాయులకు తెలిపించి ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
తెలంగాణలో కరోనా రెండో దశ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె కార్యాలయం తెలిపింది. కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు. గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలిచి , భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే దీక్ష చేపట్టినట్టు తెలిపారు.

Related posts

రేవంత్ రెడ్డి నియామకానికి రూ. 25 కోట్లు తీసుకున్నానా?.. క్షమాపణ చెప్పండి: ఎమ్మెల్యే సుధీర్!

Drukpadam

కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని మునుగోడు నుంచి పోటీకి సిద్దపడుతున్నారా?

Drukpadam

రెచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్ ప్రదేశ్ లో వంద ఇళ్లతో చైనా గ్రామం.. 

Drukpadam

Leave a Comment