Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం

దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం
-కరోనా నియంత్రణపై సుమోటోగా విచారణ
-ఇప్పటికే దేశంలో 6 రాష్ట్రాల హైకోర్టు లలో విచారణ జరుగుందన్న సి జె ఐ

-కేంద్రానికి నోటీసులు జారీ

‘‘దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోంది. నేషనల్‌ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది’’ అని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నానాటికీ ఉద్ధృతమవుతున్న వేళ దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.దేశంలో 24 గంటలలో 3 లక్షల 14 వేల 835 కేసులు నమోదయ్యాయని , 2104 మంది చనిపోయారని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ కట్టడికి జాతీయ ప్రణాళిక అవసరమన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘‘దేశంలో ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌ పద్ధతి, లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే దీన్ని మేం సుమోటోగా స్వీకరిస్తున్నాం’’ అని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే తెలిపారు . ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. కరోనా నియంత్రణకు రేపటిలోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక, ఈ అంశంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్‌ హరీష్‌ సాల్వేను అమికస్‌ క్యూరీగా నియమించింది. దీనిపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. .ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరతపై ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి జాతీయ అత్యవసర స్థితిని తలపిస్తోందని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే అన్నారు. కొవిడ్‌ నియంత్రణపై ప్రస్తుతం ఆరు హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. అయితే దీనివల్ల గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో తాము విచారణకు సిద్ధమైనట్లు ధర్మాసనం పేర్కొంది.

Related posts

ఏడాదిలోగా అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం: లోక్ సభలో నితిన్ గడ్కరీ ప్రకటన

Drukpadam

యూపీలో.కాలినగాయాలతోరోడ్డుపక్కన నగ్నంగా పడి ఉన్న కాలేజీ విద్యార్థిని

Drukpadam

ఆకాశం నుంచి చచ్చిన చేపల వర్షం!

Drukpadam

Leave a Comment