Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాశ్మీర్ తో లింక్… ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాల పెంపు?

మరోసారి చర్చకు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు…
కాశ్మిర్ రాష్ట్రంలో పెంపుకు కేంద్రం సుముఖత
ఏపీ విభజన చట్టాన్ని పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ సర్కార్
అసెంబ్లీ సీట్ల పెంపు విషయంపై సుప్రీం తలుపు తట్టిన వైనం
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా అడుగులు

కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు ఇష్టంలేక పోయినా , ఆంధ్రప్రదేశ్ విభజన చట్టప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. జమ్ము కాశ్మీర్ ను విభజించిన కేంద్రం అక్కడ అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మాటేమిటని ప్రజాప్రయోజన పిటిషన్ సుప్రీంకోర్టు కు వెళ్లడంతో కదలిక ప్రారంభమైంది. దీంతో పెంపు విషయం మరోసారి చర్చకు దారితీసింది .

ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతున్న స‌మ‌యంలో వారి ఆకాంక్ష‌ల‌కు త‌లొగ్గి అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విడ‌దీసింది. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం షెడ్యూల్-10 ప్ర‌కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీని ప్ర‌కారం ఏపీలో 175 స్థానాల‌కు మ‌రో 50 స్థానాలు అద‌నంగా పెరిగి మొత్తం 225 శాస‌న‌స‌భ స్థానాల‌వుతాయి. తెలంగాణ‌లో 119కి అద‌నంగా 34 స్థానాలు పెరిగి మొత్తం 153 శాస‌న‌స‌భ స్థానాల‌వుతాయి.

యూపీఏ-2 త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌భుత్వం విభ‌జ‌న హామీల‌ను తుంగ‌లో తొక్కింది. రాజ‌కీయంగా త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌నుకుంటేనే కేంద్ర పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ఎన్నిసార్లు రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అసెంబ్లీ స్థానాల పెంపున‌కు సంబంధించి విజ్ఞాప‌న‌లు అందించినా అవ‌న్నీ బుట్ట‌దాఖ‌ల‌య్యాయి.

తాజాగా కేంద్రం జ‌మ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ‌లో శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచాల్సి ఉన్న‌ప్ప‌టికీ జ‌మ్మూకాశ్మీర్ లో చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం వివ‌క్ష చూపిస్తోంద‌ని అందులో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో కేంద్రం ఈ ఫైలుపై వ్యూహాత్మ‌కంగా దృష్టిసారించింద‌ని తెలుస్తోంది. ఈ నెల‌లోనే ఈ కేసు సుప్రీంకోర్టులో విచార‌ణ‌కు రాబోతోంది. ఎటువైపు స‌మాధానం చెప్పి త‌ప్పించుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వానికి అవ‌కాశం లేదు. అయితే ఎటువంటి స‌మాధానం చెప్ప‌బోతోంద‌నేది న్యాయవర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. సీట్ల పెంపున‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌, వైసీపీ ఎంపీలు ఒక‌రినొక‌రు స‌హ‌క‌రించుకొని కోర్టులో వాద‌న‌లు వినిపించేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాల పెంపువల్ల రాజ‌కీయంగా త‌మ‌కు మేలు క‌లుగుతుంద‌ని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి.

సీట్లు పెర‌గ‌డంవ‌ల్ల అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌వ‌చ్చ‌ని వైసీపీ భావిస్తుండ‌గా, ప్ర‌తిప‌క్షాల‌కు అభ్య‌ర్థులు దొర‌క‌ర‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి భావిస్తోంది. బీజేపీకి ఏపీలోకానీ, తెలంగాణ‌లోకానీ రాజ‌కీయంగా లాభం చేకూరే అంశంగా క‌న‌ప‌డ‌క‌పోవ‌డంవ‌ల్లే సీట్ల పెంపుపై దృష్టిసారించ‌లేద‌ని, ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోనే దృష్టిసారించిందంటూ విమర్శలు వస్తున్నాయి. పునిర్వభజన చట్టం ప్రకారం సీట్ల పెంపె చేపడుతుందా? ఏదైనా సాకు చెప్పి తప్పించుకుంటుందా? అనే విషయంపై కేసు విచారణ జరిగేరోజు స్పష్టత రానుంది.

Related posts

ఏపీ నూతన ఎస్ఈసీగా నీలం సాహ్నీ

Drukpadam

ఇది రైతు ప్రభుత్వం …దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10 వేలు ఇస్తాం:కేసీఆర్ 

Drukpadam

రాజకీయాల్లో ఎన్టీఆర్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు …వెంకయ్య నాయుడు …

Drukpadam

Leave a Comment