Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెద్దాయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదు ..చిరంజీవి పెద్దరికం..

పెద్దాయ‌న వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం లేదు!…గ‌రిక‌పాటితో వివాదంపై చిరంజీవి కామెంట్!

  • ద‌త్త‌న్న అల‌య్ బ‌ల‌య్‌లో చిరుపై గ‌రిక‌పాటి అస‌హ‌నం
  • నాగ‌బాబు, మెగా అభిమానుల ఆగ్రహం
  • గ‌రిక‌పాటిపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌
  • ఒక్క కామెంట్‌తో వివాదానికి చెక్ పెట్టేసిన చిరంజీవి

ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు త‌న‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం, ఆ త‌ర్వాత త‌న అభిమానుల‌తో పాటు త‌న సోద‌రుడు నాగ‌బాబు ఓ రేంజిలో స్పందించిన తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టిదాకా స్పందించ‌లేదు. అయితే తాజాగా గురువారం ఆయ‌న ఈ వివాదానికి ముగింపు ప‌లికే దిశ‌గా ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. గ‌రిక‌పాటి పెద్దాయన‌. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం లేదు అంటూ చిరు కామెంట్ చేశారు. ఈ రెండు వాక్యాల‌తో గ‌రిక‌పాటితో నెల‌కొన్న వివాదానికి చిరంజీవి ముగింపు ప‌లికిన‌ట్టైంది.

ద‌స‌రా సంద‌ర్బంగా నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ కుమార్తె నిర్వ‌హించిన అల‌య్ బ‌ల‌య్‌కి చిరు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవితో అక్క‌డికి వ‌చ్చిన వారు ఫొటోలు తీసుకునేందుకు పోటీ ప‌డ‌గా… ఆ ఫొటో షూట్‌పై గ‌రిక‌పాటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చిరంజీవి ఫొటో షూట్ ఆపేసి వ‌స్తే తాను ప్ర‌సంగిస్తాన‌ని, లేదంటే తాను అక్క‌డి నుంచి వెళ్లిపోతానంటూ ఆయ‌న ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. గ‌రిక‌పాటి వ్యాఖ్య‌ల‌తో వేదిక ఎక్కిన ఆయన గ‌రిక‌పాటి ప‌క్క‌నే కూర్చున్నారు. అస‌లు త‌న‌పై గ‌రిక‌పాటి అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విష‌యాన్ని చిరంజీవి పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లే క‌నిపించ‌లేదు. అయితే నాగ‌బాబుతో పాటు మెగా అభిమానులు గ‌రిక‌పాటిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

Related posts

ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ!

Drukpadam

పాదయాత్రలో రోహిత్ వేముల తల్లిని దగ్గరకు తీసుకున్న రాహుల్ గాంధీ..

Drukpadam

తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు!

Drukpadam

Leave a Comment