Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్ లో కరోనా కోరలు… భారత్ విమానాలను రద్దు చేసిన పలు దేశాలు

భారత్ లో కరోనా కోరలు… భారత్ విమానాలను రద్దు చేసిన పలు దేశాలు
-హాస్పటల్స్ లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ లేక పిట్టల్లా రాలిపోతున్న పేషేంట్లు
-నెల రోజుల పాటు ఇండియా ,పాకిస్తాన్ విమానాలకు నో ఎంట్రీ
-కార్గో విమానాలకు మినహాయింపు
-ఒక్క రోజులు 3 .14 లక్షల కేసులు 2 వేలకు పైగా మరణాలు
-భారత్ అంటే భయపడుతున్న పాశ్చాత్య దేశాలు
-ఎక్కడ ప్రయాణికులు అక్కడే
-సుప్రీం సీరియస్ -జాతీయ ఎమర్జన్సీ గా పరిగణించాలి
భారత్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేస్తున్నట్లు కెనడా ప్రకటించింది .అంతకు ముందే బ్రిటన్ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. సింగపూర్ , హాంకాంగ్ , దుబాయ్ లాంటి దేశాలు ఇండియా విమానాలపై ఆంక్షలు విధించాయి. తాజాగా కెనడా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రవేశం లేదని ప్రకటించింది. కెనడా కాలమాన ప్రకారం 22 అర్థరాత్రి నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు కెనడా ప్రకటించింది .ఇండియా తో పాటు పాకిస్తాన్,బ్రెజిల్ నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా నిషేధం వర్తిస్తుందని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి నెల 22 నుంచే కెనడా కు వచ్చే ప్రయాణికులు కచ్చితంగా కరోనా టెస్ట్ లు చేయించుకొని రావలసి ఉంటుందని తెలిపింది . ఫ్లయిట్ బయలు దేరటానికి 72 గంటల ముందు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కెనడాలో ల్యాండ్ అయిన తరువాత తిరిగి టెస్ట్ నిర్వహిస్తారు. ఆ రిపోర్ట్ వచ్చే వరకు ప్రభుత్వం నిర్ణయించిన హోటళ్లలో ప్రయాణికుల స్వంత ఖర్చులతో ఉండాల్సి ఉంటుంది. గత వారంరోజులుగా ఇండియా నుంచి 32 విమానాల ద్వారా ప్రయాణికులు వచ్చారు. వారిలో ప్రతి 12 మందిలో ఒకరికి పాజిటివ్ ఉన్నట్లు పరీక్షలలో తేలింది. క్కుబెక్ కు వచ్చిన ఒక భారత్ ప్రయాణికుడి కి కొంత వేరియంట్ వైరస్ ఉన్నట్లు తేలింది. దానిని బి -1617 వేరియంట్ గా గుర్తించారు . దీనితో ఆందోళనకు గురైన కెనడా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని నెల రోజులుగా అమలు చేస్తామని తరువాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
భారత్ లో కేసుల సంఖ్య పెరగటం పై పాశ్చాత్య దేశాలు అందోళన చెందుతున్నాయి. అమెరికాతో సహా అన్ని దేశాలు భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిశితంగా గమనిస్తున్నాయి. భారత్ లో నిన్న ఒక్క రోజులోనే 3 లక్షల 14 వేలకు పైగా కేసులు రావడం సుప్రీం కోర్ట్ సైతం ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో దేశవ్యాపితంగా చర్యలకు మోడీ సర్కార్ ఉపక్రమించింది. అమెరికాలో జనవరి 8 న ఒకరోజులోనే 3 లక్షల 7 వేల 581 కేసులు రాగ ఆ రికార్డ్ ను ఇండియా బద్దలు కొట్టింది . మరణాలలో కూడా అమెరికా కంటే ఎక్కువమంది చనిపోతున్నారు. 2 వేల మందికి పైగా మరణిస్తున్నారు. ఇంతమంది కరోనా మహమ్మారితో దిక్కు తోచని పరిస్థితులలో ఉంటె భారత ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరించటంపై సుప్రీం కోర్ట్ సీరియస్ గా స్పందించింది . దీని జాతీయ ఎమర్జన్సీ గా ఎందుకు భావించటంలేదని ప్రశ్నించింది.సుమోటో గా కేసును స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆక్సిజన్ కొరత , బెడ్స్ లేకపోవటం ఇప్పటికే దేశంలోని ఆరు రాష్ట్రాలలోని హైకోర్టు లలో ఉన్న వ్యాజ్యాలపై కూడా సుప్రీం స్పందించింది. ఆక్సిజన్ ధరలు నాలుగు రేట్లు పెరిగాయి. ఒక్క సిలండర్ ధర 12 వేల రూపాయలు పలుకుతుంది. ఢిల్లీ సర్కార్ కు హర్యానాకు మధ్య సిలిండర్ల తరలింపుపై వాగ్యుద్ధం జరుగుతుంది. ఆక్సిజన్ సరఫరా లేక పేషంట్లు అనేక రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్నారు. భారత్ జనాభా ప్రస్తుతం సుమారు 140 కోట్లు .కోటి 60 మందికి కరోనా మహమ్మాటి అటాక్ అయింది అని నివేదికలు తెలుపుతున్నాయి. ఇది పరీక్షలు చేసుకున్న వారి సంఖ్య .సెకండ్ వేవ్ లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయినప్పటికీ ఎన్నికలు ప్రచారం అంటూ రాజకీయ నాయకులూ పెద్ద పెద్ద సభలు పెట్టి హాజరౌతున్నారు. భాద్యత గల ప్రభుత్వాలకు ఇది తగునా అనే ప్రశ్నలు ఉదహిస్తున్నాయి. కొత్త వేరియంట్ వచ్చిందని అంటున్నారు. ఇది ప్రమాద కరమైందని వైదులు చెబుతున్నారు. ఆక్సిజన్ కొరతతో కోవిద్ పేషంట్లు మృత్యువాత పడుతున్నారు. ప్రధాన నగరాలలోని హాస్పటల్స్ లో బెడ్స్ కొరత ఉండటంతో చికిత్స అందక అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఢిల్లీలో కరోనా పేషంటుతో ఉన్న తన భార్యకు బెడ్ దొరక్క తన ద్విచక్ర వాహనం పై ఢిల్లీ లోని అనేక హాస్పటల్స్ తిరిగాడు . విసుగు చెందిన ఆటను ఒక హాస్పటల్ ముందు ఆగి తన భార్యను హాస్పటల్లో చేర్చుకొని ఆమె ప్రాణాలు కాపాడమని దీనంగా వేడుకుంటున్న దృశ్యాలు చూపరులను కళ్ల నీళ్లు పెట్టించాయి. బెంగుళూరులో ఒక డాక్టర్ తన దగ్గర బందువులకు సైతం హాస్పటల్ లో బెడ్స్ దొరక్క ముగ్గురు చిపోయారని వాపోయారు. వ్యాక్సిన్ కొరతపై కూడా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశాలకు సరఫరా చేయడంలో ఉన్న శ్రద్ద దేశంలోని ప్రజలకు అందించటంలో లేదని విమర్శలు ఉన్నాయి.

Related posts

ఇన్సాకోగ్’ అధిపతి పదవికి ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ రాజీనామా…

Drukpadam

ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కొనసాగుతున్న కరోనా విజృంభణ..

Drukpadam

రాజస్థాన్ లో ఒకే కుటుంబంలో 9 మందికి ఒమిక్రాన్ పాజిటివ్!

Drukpadam

Leave a Comment