Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జబ్బార్ స్టేట్మెంట్లో లాజిక్ మిస్…

జబ్బార్ స్టేట్మెంట్లో లాజిక్ మిస్…
-2018 కోమటి రెడ్డి బ్రదర్స్ ఒకే పార్టీ ఉండి ఎమ్మెల్యేలుగా పోటీచేశారు
-పార్టీలను చూడకుండా ఓటేయమని చెప్పాల్సిన అవసరం ఏమిటి ?.
-పీసీసీ అధ్యక్ష పదవి తనకే వస్తుందని ఎప్పడు చెప్పారు
-అధికారం వస్తుందని చెప్పి మనమే అన్ని చేసుకుందామన్న వెంకటరెడ్డి
-తన పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఎన్నికకు దూరంగా ఉండటం పై సందేహాలు
-తమ్ముడి గెలుపు కోసమే తెరవెనక రాజకీయాలని ప్రచారం ..

మునుగోడు ఉపఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయమని కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్ కాల్ వైరల్ గా మారింది. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. మునుగోడు ఉపఎన్నికల యుద్ధంలో ఇది హాట్ టాపిక్ గా మారింది. కాల్ లో మాట్లాడిన వ్యక్తి జబ్బార్ అది ఇప్పటి కాల్ కాదని తనతో 2018 ఎన్నికల్లో వెంకట రెడ్డి మాట్లాడినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇందులో జబ్బార్ లాజిక్ మిస్ అయ్యాడనిపిస్తుంది. 2018 ఎన్నికల్లో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు తనతమ్ముడికి పార్టీలకు అతీతంగా ఓటు వేయాలని అనాల్సిన అవసరం లేదు . అంతే కాకుండా పీసీసీ అధ్యక్ష పీఠం తనకే వస్తుందని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. పాదయాత్ర చేస్తా …మనమే అధికారంలోకి వస్తాం అన్ని చూసు కుంటా …జబ్బార్ బాయ్ అని ప్రాధేయపడినట్లు మాట్లాడటం జరగదు.

… ఒక వేళ 2018 నాటి ఫోన్ కాల్ అయితే నిన్న మీడియాలో రావడంపై వెంకటరెడ్డి స్పందించి దాన్ని తీవ్రంగా ఖండించాలి…. అది జరగలేదు . నిజంగా ఆ ఫోన్ కాల్ 2018 నాటిదే అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పై నిజంగా రాజకీయ కుట్ర జరుగుతుందని అనుకోవాల్సి వస్తుంది. దానిపై వెంకటరెడ్డి ఫిర్యాదు చేసి వాస్తవాలు బయటకు తీసేలా చేయాలి . రాజగోపాల్ రెడ్డి కి ఓటేయాలని చెప్పటం అది మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ఛానల్స్ లో రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ బిజెపి అభ్యర్థి కి ఓటేయ్యాలని చెప్పటం పై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి . దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి ఓటు వేయాలని చెప్పడం రాజకీయ ఆత్మహ్యత సదృశ్యం అవుతుందని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది నిజం కాదని , ఇది తన తమ్ముడు చేసిన ఫోన్ కాల్ కాదని ఇందులో ఏదో మర్మం ఉందని, మా పై కుట్ర జరుగుతుందని ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ఖండించారు. అంతేకాకుండా తన అన్నను బదనాం చేసేందుకు జరుగుతున్న దుష్ప్రచారం పేర్కొన్నారు. ఈ ఫోన్ కాల్ ఇప్పటిది కాదని 2018 ఎన్నికల్లో తనకు వెంకట్ రెడ్డి ఫోన్ చేసినట్లుగా ఆ ఫోన్ కాల్ లో మాట్లాడినట్లు చెబుతున్న జబ్బార్ అనే వ్యక్తి చెబుతున్నట్లుగా ఒక స్టేట్ మెంట్ వచ్చింది. 2018 ఎన్నికల్లో శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్పై ఇద్దరు అన్నదమ్ములు వెంకటరెడ్డి ,రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు. అప్పట్లో ఎవరు ప్రచారం నిర్వహించుకున్నారు. నల్లగొండలో పోటీ చేసిన వెంకటరెడ్డి ఓడిపోగా, మునుగోడు నుంచి పోటీచేసిన రాజగోపాల్ రెడ్డి భారీ మైజార్టి తో గెలుపొందారు . అంతేకాకుండా 2018 ఎన్నికల నాటికి నాటికి తాను పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని గాని లేదా తన తమ్ముడికి ఓటు వేయమని చెప్పడం గానీ జరిగి ఉండే ఛాన్స్ లేదు . ఒకవేళ ఉన్నా పార్టీలకతీతంగా తమ్ముడికి ఓటేయమని అభ్యర్థించడం జరగదు . ఒక వేళా జరిగిన నేరుగానే తనతమ్ముడుకి పార్టీలకు అతీతంగా ఓటువేయమని అడగరు . ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నందున ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి ఓటు వేయమని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. నేడు జరుగుతున్నది ఒక ఉపఎన్నికే అయినా కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు అయినందున ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధాన పోటీదారులు .

కాంగ్రెస్ ముఖ్య నేత పీసీసీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారా ? ఇదేనా పార్టీ అభివృద్ధి…. తల్లి కొడుకు , తండ్రి కొడుకు , అన్నతమ్ములు వివిధ పార్టీలనుంచి పోటీచేసి ఎవరు పార్టీ తరుపున వారు నిబద్దతో పని చేసినవారు ఉన్నారు. కానీ వెంకటరెడ్డిలా ఒక పార్టీ లో ఉండి మరో పార్టీకి కన్ను గీటినవారు అరుదుగా కనిపిస్తారు .

ఒక పార్టీలో ఉండి మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పడం కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేసింది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీచేస్తున్నందున తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఇబ్బంది అనే ఉద్దేశం తో ప్రచారానికి రావడంలేదని అనుకున్నారు.కానీ అది నిజం కాదని కావాలనే తన తమ్మడిని గెలిపించేందుకు తెరవెనక రాజకీయాలు నడుపోతున్నారని రాజకీయ పండితులు సైతం పేర్కొంటున్నారు

Related posts

కాంగ్రెస్ లో పీసీసీ పదవి చిచ్చు కోమటిరెడ్డి ఫైర్ …ముఖ్యనేతలు పార్టీకి గుడ్ బై…

Drukpadam

ఖమ్మం కాంగ్రెస్ లో రేవంత్ నిరుద్యోగ నిరసన ర్యాలీ జోష్…

Drukpadam

ఈటల లాంటి నాయకుడు బీజేపీకి అవసరం: రాజాసింగ్!

Drukpadam

Leave a Comment