ముందు రూ. 100 కోట్లు అన్నారు.. ఇప్పుడు రూ. 15 కోట్లు అంటున్నారు: కిషన్ రెడ్డి
- ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ సృష్టి అన్న కిషన్ రెడ్డి
- నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన బీజేపీకి ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్య
- ఫిరాయింపుల మాస్టర్ కేసీఆర్ అని విమర్శ
ఫిరాయింపుల మాస్టర్ కెసిఆరేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆయనకు అసలు నైతిక విలువలు లేవని ఆరోపణలు గుప్పించారు. .2014లో గాని 2018 లో గాని గెలిచిన ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి తమ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు మొత్తం కెసిఆర్ డైరక్షన్ లోనే జరిగిందన్న విషయం ప్రతి ఒక్కరికి అర్ధమైందని పేర్కొన్నారు. మునుగోడులో ఓటమి భయంతో కలత చెందిన కేసీఆర్ ఏదో ఓ రకంగా ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎమ్మెల్యేల ఫిరాయింపు నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు. ఇది టిఆర్ఎస్ పతనానికి పరాకాష్ఠ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని కేసీఆర్ కూడ తన పతనాన్ని తానే కోరితెచ్చుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి. ఒక ఎమ్మెల్యే కి ఎంత ఇస్తామని చెప్పారు .ఎంత ఇచ్చారు .ఈ విషయాన్ని ఎవరు ఏలా ఎందుకు లీక్ చేశారు ఇందులో బుద్ధిమంతులు ఎందరు అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా సిబిఐతో గాని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అయిన కేసీఆర్ అబద్ధాలు నాటకాలు డ్రామాలు ఆపాలన్నారు. వాస్తవ విషయాలు ప్రజలు తెలియాలంటే సిబిఐ తో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు సిద్ధమేనా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఒకవేళ వస్తే ఈ నలుగురు ఎందుకు దేనికి సరిపోతారని ఆయన ప్రశ్నించారు .ఈ నలుగురిలో ముగ్గురు కెసిఆర్ కొనుగోలు చేసిన విషయం వాస్తవం కాదా? ప్రశ్నించారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని ప్రజలు ఎవరూ కూడా కెసిఆర్ చెప్పిన మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరని కిషన్ రెడ్డి పేర్కొన్నారు . మునుగోడు ఎన్నికల్లో బిజెపి పార్టీ కచ్చితంగా గెలుస్తుందని అందుకే ఓటమి భయం పట్టుకుని ఇందులో నుండి బయటపడేందుకు కేసీఆర్ రకరకాల ఎత్తులు జిత్తులు వేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
రూ. 100 కోట్లతో ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలకు అంత స్థాయి కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇదంతా ప్లాన్ గా చేసిన వ్యవహారమని చెప్పారు. దీనికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబంపై ముందు కేసులు పెట్టి జైలుకు పంపాలని అన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని చెప్పారు. ఏదో ఒక డ్రామా చేసి మునుగోడులో గెలవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నమని విమర్శించారు. తమ ముందు కేసీఆర్ విఠలాచార్య సినిమాలు పని చేయవని అన్నారు.