కరోనా కట్టడిలో యంత్రాంగం విఫలం … రాహుల్ గాంధీ
కాంగ్రెస్ శ్రేణులు రాజకీయాలు వదిలేసి ప్రజాసేవకు అంకితం కావాలి
దేశంలో కరోనా స్వైరవిహారం
ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
ప్రజాసేవ ఎంతో ముఖ్యమని వెల్లడి
ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి
ఇది కాంగ్రెస్ విద్యుక్త ధర్మం అని వ్యాఖ్యలు
దేశంలో కరోనా వైరస్ అడ్డుఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతుండడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు కరోనా కట్టడిలో ఘొరంగా విఫలం చెందారు. దీన్ని జాతీయ ఎమర్జన్సీ గా ఎందుకు ప్రకటిచకూడదని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ దొరక్క రాష్ట్ర ప్రభుత్వాలు అల్లాడుతున్నాయి . దీనికి జాతీయ విధానం లేకుండా మందుల సరఫరాలోనూ వ్యాక్సిన్ సరఫరాలోనూ కేంద్ర వైఖరిని రాష్ట్రాలు తప్పుపడుతున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఒకటి అర కేసులు వచ్చినప్పుడు చేసిన హడాహుడి ఇప్పుడు కనిపించటం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రకటనలకు, వర్చువల్ మీటింగ్ లకు పరిమితమైతే ప్రయోజనం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరగటంతో అనేక దేశాలు మనదేశానికి విమానాలు నడిపేందుకు నిరాకరించాయి. ప్రస్తుతం ప్రపంచం గ్లోబల్ విలేజ్ కాన్సస్ప్ట్ లో ఉంది. ఒక దేశంపై మరొక దేశం ఆధారపడక తప్పని పరిస్థితి . ఈ తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం కరోనాపై చేతులెత్తేసింది . ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రజలను ఆదుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశానికి భాధ్యతాయుతమైన పౌరుల అవసరం ఎంతో ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజకీయాలు వదిలి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆలంబనగా నిలవాలి ఈ విపత్కర సమయంలో ఏ కొద్దీ సహాయం అయినా కొండంత మనోదైర్యానికి క్రరణమౌతుంది. అందుకు పార్టీ శ్రేణులన్నీ కృషి చేయాలనీ అన్నారు
కాంగ్రెస్ సహచరులు అన్ని రాజకీయపరమైన కార్యకలాపాలను వదిలేసి ప్రజాసేవకు ఉపక్రమించాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు సంపూర్ణ సహకారం అందిస్తూ వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇది కాంగ్రెస్ కుటుంబ విద్యుక్త ధర్మం అని స్పష్టం చేశారు. ఇది మన తక్షణ కార్త్యంగా ఉండాలని అన్ని రాష్ట్రాలలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు , ప్రజాప్రతినిధులు ఇప్పటినుంచే రంగంలోకి దిగాలని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టండి .ప్రజల సేవలో నిమగ్నం అవ్వండని రాహుల్ పిలుపునిచ్చారు.