Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఐపీల్ ఆటగాళ్ల పై బీసీసీఐ కీలక ప్రకటన … ఇబ్బందులు ఉంటె వెళ్లవచ్చు

ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లు ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే మాకు అభ్యంతరం లేదు: బీసీసీఐ
  • కరోనా నేపథ్యంలో ఒత్తిడికి గురవుతున్న ఆటగాళ్లు
  • కుటుంబీకులకు కరోనా సోకడంతో అర్ధాంతరంగా వైదొలగిన అశ్విన్
  • ఆటగాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తామన్న బీసీసీఐ
Its fine If anyone wants to leave from IPL says BCCI

ఇండియా లో ఐపీల్ అంటే ఒక క్రేజు …. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఇది నిర్వయించబడటం పై అంచనాలు అధికంగానే ఉన్నాయి. ఇది భారత్ లో క్రికెట్ గతిని మార్చింది. గత ౧౦ సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతుంది.ఇందులో ఆడేందుకు దేశంలోని యువ క్రికెటర్లే కాకుండా అంతర్జాతీయంగా ఉన్న అత్యున్నత ఆటగాళ్లు వివిధ టీంలలో ఆడుతుండటంతో అందరిని చూసే అవకాశం ఐపీల్ ద్వారా కలుగుతుంది.ప్రపంచంలో క్రికెట్ ను ప్రేమించే దేశంలో భారత్ అగ్రస్థానంలో ఉంది.అనేక మంది రాజకీయనాయకుల నుంచి అన్ని వర్గాల ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్న ఆటగా దీనికి స్తానం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకు ,జెండర్ తో సంబంధం లేకుండా అభిమానించే క్రికెట్ కు ఐపీల్ రూపంలో వచ్చిన సీరీస్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. క్రికెట్ ఆటగాళ్లను అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.ఇప్పడు జరుగుతున్న ఐపీల్ కు కరోనా తాకిడి ఇబ్బంది గా మారింది.అనేక మంది ఐపీల్ ఆడేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన క్రికెటర్ల ఒక వేల వారి దేశానికి వెళ్లి పోవాలని అనుకుంటే తమకు వేలాంటి అభ్యంతరం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.ఇప్పటికే చెన్నై కి చెందిన రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ తరుపున ఆడుతున్నాడు . వారి కుటుంబ సభ్యుల్లో అనేక మంది కరోనా భారిన పడ్డారు దీంతో ఆయన ఐపీల్ నుంచి వైదొలుగు తున్నట్లు ప్రకటించారు. వారి ఆందోళనను అర్థం చేసుకున్న బీసీసీఐ అందుకు అంగీకరించటమే కాకుండా వారి నిర్ణయాలను గౌరవిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఆటగాళ్ల పై వత్తిడి తగ్గించే చర్యగా క్రికెటర్లు భావిస్తున్నారు. గత సీజన్ లో భారత్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఈ సారి ప్రేక్షకులు లేకుండానే దేశంలోనే నిర్వహించేందుకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఇప్పటి వరకు అంతా సవ్యంగానే సాగుతున్న తరుణంలో కుటుంబ సభ్యులకు కరోనా సోకడం తో అశ్విన్ తప్పుకున్నారు . ఆయన ఢిల్లీ కాపిటల్ తరుపున ఆడుతున్నారు.
దేశంలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న తరుణంలో ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా తమ కుటుంబీకులు కరోనా బారిన పడుతుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా వెదొలిగాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల అభిప్రాయాలకు గౌరవమిస్తామని తెలిపింది.
ఇప్పటి వరకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిందని బీసీసీఐ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే… అది వారు తీసుకున్న మంచి నిర్ణయంగానే భావిస్తామని చెప్పారు.

Related posts

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం…నివ్వెర పోయిన క్రికెట్ ప్రపంచం !

Drukpadam

ఐపిల్ ఐదు సార్లు ఛాంపియన్ ముంబయికి అవమానకరం…

Drukpadam

ఇండియా …పాక్ మ్యాచ్ నోబాల్ పై షోయబ్ అఖ్తర్ విమర్శలు!

Drukpadam

Leave a Comment