Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నడుము – వెన్ను నొప్పి వేధిస్తుంటే.. ఇవి ట్రై చేయండి!

నడుము – వెన్ను నొప్పి వేధిస్తుంటే.. ఇవి ట్రై చేయండి!

  • కదలకుండా గంటల తరబడి పనిచేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు
  • వెన్నెముక, కండరాలపై ఒత్తిడి పెరిగిపోతుంది
  • దీర్ఘకాలిక సమస్యగా మారకముందే జాగ్రత్త పడితే మంచిది

నడుము నొప్పి.. నేడు చాలా మంది ఈ సమస్య చెప్పడం వినే ఉంటారు. 30-40 ఏళ్ల వయసు వారి నుంచి కూడా ఇది వినిపిస్తుంటుంది. గంటల పాటు కూర్చుని పనిచేసే ఉద్యోగాలే నేడు ఎక్కువ. శరీరానికి పెద్దగా పని లేకుండా మెషినరీ సాయంతో సౌకర్యంగా జీవితాన్ని సాగిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాల్సిందే..? అన్నట్టు సౌకర్యం కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయడం సరికాదు.

ఎక్కువ గంటల పాటు పనిచేయాల్సి రావడంతో వెన్నులోని డిస్క్ లపై ఒత్తిడి పడుతోంది. అలాగే, వెన్నుపాము పక్కన కండరాలపైనా ఈ ఒత్తిడి ఉంటుంది. దీంతో నడుం నొప్పి విడవకుండా చాలా మందిని వేధిస్తోంది. కొందరికి జన్యు సంబంధ కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. మానసికపరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా నడుం నొప్పి కనిపిస్తున్నట్టు ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక దీర్ఘకాలిక సమస్యగా మారిపోయే నడుం నొప్పి విషయంలో అశ్రద్ధను పక్కన పెట్టి, నివారణకు చర్యలు అమలులో పెట్టడం ఎంతైనా అవసరం.

సరైన భంగిమ
కూర్చున్నప్పుడు భంగిమ సరిగ్గా లేకపోతే వెన్నుపాములోని డిస్క్ లపై ఒత్తిడి పడి దెబ్బతింటాయి. కనుక ఆకృతి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. భంగిమ సరిగ్గా లేకపోతే మెడపైనా ఒత్తిడి పడుతుందని తెలుసుకోవాలి. జియో రాక ముందు.. వచ్చిన తర్వాత అని ఆరోగ్యం విషయంలోనూ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే జియో వచ్చిన తర్వాతే స్మార్ట్ ఫోన్లలో నెట్ వినియోగం పెరిగింది. అప్పటి వరకు అదే పనిగా గంటల తరబడి ఫోన్లను చూసేవారు అసలు కనిపించే వారే కాదు. జియో తెచ్చిన ఉచిత, చౌక డేటా ఫలితంగా స్మార్ట్ ఫోన్ వినియోగం కొత్త శిఖరాలకు చేరింది. ఫోన్ చూసే సమయంలో తలను ముందుకు వంచి అదే పనిగా ఎక్కువ సమయం పాటు ఉండిపోతున్నారు. ఇది వెన్నెముక దెబ్బతినడానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ను కంటికి సమాంతర ఎత్తులో ఉంచి చూసుకోవాలి. ఫోన్ చూసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తల బెండ్ కాకూడదు.

విరామం
ఇక ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చుండిపోవడం కాకుండా మధ్యలో విరామం ఇవ్వడం అవసరం. అది ఆఫీసులో అయినా ఇంట్లో అయినా కానీ, కనీసం అరగంటకు ఒకసారి 1-2 నిమిషాలు కదలిక ఉండేలా చూసుకోవాలి. లేదంటే గంటకు 3-4 నిమిషాలు నడిచినా మంచి ఫలితం కనిపిస్తుంది. వెన్నెముక, కండరాలపై అప్పటి వరకు పడిన ఒత్తిడి తొలగిపోతుంది.

వ్యాయామాలు
వెన్నెముక బలోపేతానికి వ్యాయామాలు ఉన్నాయి. యూట్యూబ్ లో చూసి తెలుసుకోవచ్చు. యోగాసనాలు మంచి ఆప్షన్. వేగంగా నడవడం కూడా చేయవచ్చు. దీనివల్ల నడుం నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది. వ్యాయామాలతో రక్తంలోని ఆక్సిజన్, పోషకాలు కండరాల్లో నూతనోత్తేజాన్ని తీసుకొస్తాయి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది.

సరైన ఆహారం
కొవ్వులతో కూడిన ఆహారం తగ్గించుకోవాలి. నీరు అధికంగా తీసుకోవాలి. క్యాల్షియం, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారానికి చోటు కల్పించాలి.

Related posts

యూపీ ప్రభుత్వం ప్రకటనలో కోల్‌కతా బ్రిడ్జి.. టీఎంసీ-బీజేపీ మాటల యుద్ధం!

Drukpadam

ఆ రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు 17 వేల మంది!

Drukpadam

తలుపులకు ఇష్టమొచ్చిన రంగు వేసినందుకు..19 లక్షల జరిమానా!

Drukpadam

Leave a Comment