కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడ పని చేశారు. ఎం. సత్యనారాయణరావు (ఎంఎస్‌ఆర్) కన్నుమూశారు . కొవిడ్ లక్షణాలతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ చైర్మన్‌గా ఎంఎస్‌ఆర్ చేశారు. ఆయన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ శాఖా మంత్రి విధులు నిర్వహించారు. ఎం ఎస్ ఆర్ గా పిలవబడే ఆయన వివాదాలకు దూరంగా ఉండేవారు. మూడుసార్లు కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. 5 వ లోకసభకు తెలంగాణ ప్రజాసమిత నుంచి గెలుపొందిన ఆయన అనంతరం కాంగ్రెస్ లో చేరి 6,7 లోకసభలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఎంఎస్‌ఆర్ మృతిపై కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.