Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మంలో ఈడీ, ఐటీ దాడుల కలకలం …పరేషాన్ లో ప్రవేట్ ఆసుపత్రులు!

ఖమ్మంలో ఈడీ, ఐటీ దాడుల కలకలం …పరేషాన్ లో ప్రవేట్ ఆసుపత్రులు!
-బిలీఫ్ ,రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ ,డాక్టర్ గుర్నాథరావు ఆస్పత్రులే లక్ష్యం
-ఖమ్మం ,కరీంనగర్ తో సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈడీ, ఐటీ దాడులు!
-30 బృందాలతో తెలంగాణలో ఈడీ, ఐటీ ముమ్మర దాడులు
-బిలీఫ్ ఆసుపత్రిలో ఫైళ్లు అన్ని బయటకి విసిరేసినట్లు ప్రచారం
-కొన్నిటిని ఇతర ప్రాంతాలకు తరలించారని సమాచారం
-భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు

హైదరాబాద్, కరీంనగర్లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు
ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి ఈడీ, ఐటీ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు . మొత్తం 150 కి పైగా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ముందుగానే ఎంచుకున్న ప్రాంతాలకు అత్యంత గోప్యంగా వెళ్లారు . అక్కడ ఉన్న సిబ్బందిని ఎవరు ఎటు కదలవద్దని ఎక్కడ వారు అక్కడే ఉండాలని ఆదేశించారు .తాము ఐటీ ,ఈడీ దర్యాప్తు సంస్థలనుంచి వచ్చామని గుర్తింపు కార్డులు చూపించారు .

ఈలోగానే ఎలర్ట్ అయిన యాజమాన్యం తమ ఆసుపత్రులలో ఉన్న ముఖ్యమైన ఫైళ్లను ఇతర ప్రాంతాలకు తరలించారని సమాచారం . అనేక ఆసుపత్రులు ఐటీ శాఖకు వాళ్లకు వస్తున్నా ఆదాయానికి కడుతున్న ఐటీ కి పొంతన లేకుండా ఉంటుందని వీరు ఫెమా నిబంధనలు ఉల్లంగిస్తున్నారని తెలుస్తుంది. ప్రధానంగా బిలీఫ్ ఆసుపత్రి యాజమాన్యం ఇటీవల మునుగోడు ఎన్నికల్లో ఒక పార్టీకి అనుకూలంగా బస్తాల కొద్దీ డబ్బు తరలించారని ఈ విషయాలు సెంట్రల్ ఇంటలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ఈడీ , ఐటీ లు వారి లావాదేవీలు కడుతున్న ఇన్ కం టాక్స్ కు సంబంధం లేదని అందువల్లనే కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం మేరకు దాడులు జరిగాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మం వైరా రోడ్ లోని బిలీఫ్ , రోహిత్ ఆసుపత్రులు పక్కపక్కనే ఉండగా గుర్నాథ్ రావు కు చెందిన శ్రీరామ్ కిడ్నీ సెంటర్ పాత బస్సు స్టాండ్ సమీపంలో ఉంది. ఈ ఆసుపత్రులకు విఫరీత ఆదాయం ఉన్న అందుకు తగ్గట్లు ఐటీ చెల్లించకుండా డబ్బులను ఇతర ఆదాయాలను గుడపెడుతున్నారని ఖమ్మం చుట్టూ పక్కల విలువైన భూములను కొనుగోలు చేశారని అన్ని ఆధారాలతోనే వారిపై ఐటీ , ఈడీ దాడులు జరిగాయని అనుకుంటున్నారు .

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ శాఖలు తెలంగాణలో దూకుడు పెంచాయి. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ కేసుల నిమిత్తం ఈడీ అధికారుల బృందాలు ఈ ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాయి. దాదాపు 30 బృందాలు హైదరాబాద్ తో పాటు ఖమ్మం కరీంనగర్ లో సోదాలు నిర్వహిస్తున్నారు .

కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి దాడి

ఢిల్లీ నుంచి ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక బృందాలు
మంత్రి గంగుల కమలాకర్ ఇంటి తాళాలు పగులగొట్టి సోదాలు చేస్తున్న ఐటీ, ఈడీ అధికారులు
కరీంనగర్ లోని గంగుల ఇంటిలో ఈడీ, ఐటీ సోదాలు
గంగుల ఇంటితో పాటు ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీల్లో సోదాలు
గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలంటూ దాడులు కొనసాగుతున్న వైనం

ఐటీ శాఖ అధికారులు తోడుగా హైదరాబాద్ లోని సోమాజిగూడ, అత్తాపూర్ లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. కరీంనగర్ లోని గ్రానైట్ వ్యాపారులే లక్ష్యంగా సోదాలు చేస్తున్నాయి. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లఘించారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలపై దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ(ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు…అందులో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ ఈ సంస్థల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోని గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ అధికారులు ఆయన ఇంటిలోకి ప్రవేశించారట.

కరీంనగర్ లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలోని కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహావీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే తెలంగాణకు చెందిన 8 సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆదాయపన్ను శాఖ అధికారులతో కలిసి ఈడీ దాడులు చేస్తుండటం గమనార్హం. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికలు ముగిసినంతనే ఈ దాడులు జరుగుతుండటంపై పెద్ద చర్చే నడుస్తోంది.

Related posts

ఆదాయం రూ.7 లక్షలకు పైన కొంచెం ఉంటే పన్ను లేదు!

Drukpadam

బాలాపూర్ వినాయకుడి లడ్డూను సీఎం జగన్ కు అందించిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్!

Drukpadam

ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు… హాజరుకానున్న ప్రధాని మోదీ!

Drukpadam

Leave a Comment