Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

మాస్క్ మాదిరిగా పెయింట్ వేసుకున్న యువతి… పాస్ పోర్ట్ నే సీజ్ చేసిన అధికారులు!

మాస్క్ మాదిరిగా పెయింట్ వేసుకున్న యువతి… పాస్ పోర్ట్ నే సీజ్ చేసిన అధికారులు!
  • ఇండొనేషియాలోని బాలీలో ఘటన
  • సూపర్ మార్కెట్ కు వచ్చి వీడియోలు
  • సీరియస్ గా తీసుకున్న అధికారులు
Trouble for Ladies Who Paint Their Face as a Mask

కొవిడ్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే మాస్క్ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఎంతగా మొత్తుకుంటున్నా, కొందరు వినే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా యువతులైతే, తమ అందానికి అడ్డుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇదే ఆలోచనతో ఉన్నఇండోనేషియాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు వినూత్నంగా ఆలోచించారు గానీ, ఆపై చిక్కుల్లో పడ్డారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, బాలీలో ఉంటున్న జోష్ పాలర్ లిన్, లీయా అనే ఇద్దరు అమ్మాయిలు, మాస్క్ కు బదులుగా, తమ ముఖాలకు సర్జికల్ మాస్క్ మాదిరిగా కనిపించేలా నీలి రంగులో మాస్క్ లు వేసుకుని ఓ సూపర్ మార్కెట్ కు వచ్చారు. ఆపై వీడియోలు తీసుకున్నారు. దీన్ని చూసిన వారు అది మాస్క్ కాదని, పెయింటింగ్ అని పలువురు గుర్తించి ఫిర్యాదు చేశారు. దీంతో ఇండొనేషియా అధికారులు, వారిద్దరి పాస్ పోర్టులను సీజ్ చేశారు.

Related posts

ఏపీ అభ్యర్థనకు కేంద్రం నో.. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేయాల్సిందేనని స్పష్టీకరణ

Drukpadam

ఒమిక్రాన్ కలకలం.. ఆఫ్రికా నుంచి వచ్చిన వందలాది మంది అడ్రస్ లేరు!

Drukpadam

చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్!

Drukpadam

Leave a Comment