Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎన్ ఆర్ ఐ జీవితం …ఒక రంగుల ప్రపంచం!

ఎన్ ఆర్ జీవితంఒక రంగుల ప్రపంచం!
పిల్లలు విదేశాల్లోతల్లిదండ్రులు స్వదేశంలో
వృద్ధాప్యంలో పట్టించుకునే దిక్కులేక తల్లిదండ్రుల అగచాట్లు
కొడుకులు ,కూతుళ్లు , మనవలు ,మనవరాళ్లు తో ప్రేమను పంచుకోలేక పోతున్న నైరాశ్యం
తిరగగలిగితేనే తల్లిదండ్రులను విదేశాలకు తీసుకుపోతున్న పిల్లలు
వాళ్లతో బండ చాకిరీ చేయిస్తున్న వైనం
వారి వైద్యఖర్చులు భరించాల్సి వస్తుందని స్వదేశాలకు పంపిస్తున్న పిల్లలు
తల్లిదండ్రులను వృద్దాశ్రమాలలో పెడుతున్న పిల్లలు

అమెరికా

ఎన్ ఆర్ ఐ ఇప్పుడు భారత దేశంలో, ఇది ఒక ఫ్యాషన్ పదంగా మారింది …మావాడు అమెరికాలో ఉన్నాడు …మావాడు ఇంగ్లాండ్ లో మాఅమ్మయి ఆస్ట్రేలియా లో ,మా అబ్బాయి, అమ్మాయి కెనడాలో మావాడు జర్మనీలో మా అమ్మాయి ఫ్రాన్స్ , ఇటలీ ,స్విజ్జర్లాండ్ ,నెదర్లాండ్ ,రష్యా , చైనా ,లాంటి అనేక దేశాల పేర్లు చెబుతున్నారు.ఇది సొసైటీ లో చెప్పుకోవడానికి గొప్ప స్టేటస్ గా మారింది. దీనికి తగ్గట్లుగా ఎన్ ఆర్ ఐ పేరెంట్స్ సంఘాలు కూడా వెలిశాయి. విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమతమ ప్రాంతాల్లో సంఘాలు పెట్టుకొని మావాడు ఇంత సంపాదిస్తున్నాడు , మీవాడు ఎంత సంపాదిస్తున్నాడని ఆరాలు తీయడం రివాజుగా మారింది.

ప్రాన్స్ 

వనభోజనాలు, హెల్త్ క్యాంపులు దానధర్మాలుకూడా చేస్తున్నారు. వారి పిల్లలు పంపినా పంపకపోయినా, వారి పేరుతో కొందరు ఇక్కడ గొప్పలకు పోతున్నవారు లేకపోలేదు . అయితే ఎన్ ఆర్ ఐ పేరుతో  సంఘాలు ఎందుకు పెట్టాలనే ప్రశ్నలుకూడా లేకపోలేదు . సీనియర్ సిటిజన్ సంఘాలు అని  పెట్టుకొని ఆపేరుతో కార్యక్రమాలు చేపడితే తప్పేమిటనే అభిప్రాయాలు ఉన్నాయి. సరే ఏ పేరుతో అయినా కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయికదా ?అనే వారు లేకపోలేదు …అందుకు వారిని అభినందిద్దాం …

ఇంగ్లాండ్ 

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయోజకులను చేయాలనీ పైసాపైసా కూడబెట్టి విదేశాల్లో చదువులకోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంపితే రంగుల ప్రపంచానికి ఆకర్షితులై అక్కడే ఉండి పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కని స్వదేశానికి వచ్చేందుకు ఇష్టపడని అనేక మందిని చూస్తున్నాం … అక్కడే ఉద్యోగాలు చేస్తూ అప్పుడప్పుడు తల్లితండ్రులను తీసుకోని పోవడం జరుగుతుంది. అందుకు తల్లిదండ్రులు కూడా విదేశాలకు వెళ్లామని మావాడు ,మాఅమ్మాయి తీసుకోని పోయిందని అక్కడ ఉన్నట్లు ఇక్కడలేదని తమ భాదలు ,కష్టాలు దాచిపెట్టుకొని గొప్పలు మాత్రమే చెప్పుకొని సంతృప్తి చెందుతున్న వారు లేకపోలేదు . అదికూడా తల్లిదండ్రులు తిరగగలిగినప్పుడే ….తాము పిల్లలను కనే సందర్భంలో వారికీ ఆసరాకోసమే తల్లిని లేదా అత్తలను తీసుకోని పోతున్నారు . వారు ములనపడి ఆనారోగ్యం పాలైతే డబ్బులు పంపిస్తాం వైద్యం చేయించుకోండి అనే పిల్లలే అధికంగా ఉన్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి.

ఆస్ట్రేలియా

కుటుంబ వ్యవస్థ కుదేలు అవుతుంది.అన్నదమ్ములు , అక్క చెళ్ళళ్ళు బంధాలు ఎప్పుడో తెగిపోయాయి…ఇప్పుడు తమ స్వంత పిల్లలతో బంధాలు ప్రశ్నర్ధకంగా మారాయి… తిరగలేని తల్లిదండ్రులను పిల్లలు విదేశాలకు తీసుకోని పోయేందుకు ఇష్టపడటంలేదు …. వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు ….కొన్ని సందర్భాల్లో చనిపోతే కర్మకాండలు కానివ్వండని మాకు ఇక్కడ నుంచి రావడానికి ఇబ్బందిగా ఉందని ఖర్చులకోసం డబ్బులు పంపుతున్నామని బంధాలను వాణిజ్యపరం చేసినవారు ఉన్నారు . ఇటీవల కొన్ని విచిత్రమైన సంఘటనలు వింటున్నాం చనిపోతే ఏడ్చేందుకు సైతం కిరాయివారిని ఏర్పాటు చేస్తున్నారు .

కెనడా

ఎన్ ఆర్ ఐ అంటే డబ్బు బాగా ఉన్నవాడనే అభిప్రాయాలూ ఉన్నాయి. తమ పిల్లలు అక్కడ ఎంత సంపాదిస్తున్నా , వారి ఖర్చులు ఎలా ఉన్నా డాలర్ల రేటు పెరగటం రూపాయ రేటు డౌన్ కావడంతో విదేశాల్లో ఉన్న పిల్లలు కొంత సంపాదించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు . వారి ఆదాయానికి తగ్గట్లుగానే ఖర్చులు ఉన్నాయి.కారు ,ఇల్లు ,రోజు వారి ఖర్చులు , ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు ఖర్చు బాగానే అవుతుంది . అందుకే అక్కడ ఐదు రోజులు సంపాదించి రెండు రోజులు ఖర్చుపెట్టామని అంటుంటారు . మన రూపాయితో పోల్చి చూసుకొని ఖర్చులు తగ్గించుకున్నవారు బాగానే సంపాదిస్తున్నారు .

జర్మనీ

అయితే వెల్త్ పెరుగుతున్నా హెల్త్ దెబ్బతింటుందని అంటున్న పిల్లలు ఉన్నారు . మనకు తెలిసినవాళ్ళు, చుట్టాలు పక్కాలు లేకపోవడం , దగ్గర బంధువుల ఇళ్లలో పంక్షన్లకు దూరంగా ఉండటం వారికీ తీరని మనోవేదనగానే మిగులుతుంది. డబ్బుసంపాదన ఉన్నా ,మానసిక ఉల్లాసానికి దూరంగా ఉండటం వారిని వేధిస్తున్న సమస్యలుగానే ఉన్నాయి. మనదేశం వారికి విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం ప్రతి వ్యక్తి చమట చుక్కనుంచి వచ్చిన డబ్బును ఖర్చు పెట్టింది. దాన్ని దేశం కోసం కాకుండా విదేశాల వ్యామోహంలో పడి దేశాన్ని విస్మరించడం , బంధాలను బంధుత్వాలను దూరం చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది….

ఇండియా

Related posts

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఏపీ అధికారులకు హైకోర్టు శిక్ష అమలు!

Drukpadam

కాల్వలో కనిపించిన కారు.. యజమాని ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న మిస్టరీ!

Drukpadam

షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్….! 

Ram Narayana

Leave a Comment