Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

 

అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
  • కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సరిపోవు
  • టెస్టుల కోసం వేచి చూడకుండా పేషెంట్లకు చికిత్స అందించాలి
  • పోలీసులు కూడా మాస్క్ ధరించేలా చేయాలి
Telangana High Court fires on state government

చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూతో పాటు అన్ని సమావేశాలు, వేడుకలను 50 శాతం కుదించాలని ఆదేశించింది. అంబులెన్స్ డ్రైవర్లు చేతివాటానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అంబులెన్సులు అందుబాటులో లేకపోతే  గుర్రాలను వాడాలని ఆదేశించింది.

ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేచి చూడకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లకు వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు వాయుమార్గాలను సిద్ధంగా ఉంచాలని భారత వాయుసేనను కోరింది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కరోనా చికిత్సను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని… తద్వారా కోవిడ్ సెంటర్లపై ఒత్తిడిని తగ్గించాలని ఆదేశించింది. పోలీసులకు కూడా మాస్క్ కంపల్సరీ చేయాలని చెప్పింది. పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది.

 

Related posts

మహిళలపై మరో హుకుం జారీ చేసిన తాలిబన్లు!

Drukpadam

కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన చంద్రబాబు!

Drukpadam

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా శ్యామ్యూల్… ?

Drukpadam

Leave a Comment