గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మా సీఎం అభ్యర్థి భూపేంద్ర పటేలే: అమిత్ షా!
- అహ్మదాబాద్ లో జాతీయ మీడియాతో మాట్లాడిన అమిత్ షా
- ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే భూపేంద్ర తన పదవిలో కొనసాగుతారని వ్యాఖ్య
- పరోక్షంగా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి
గుజరాత్ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.ఇప్పటికే కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుందని అనుకొంటుండగా ,అప్ వారికీ సవాల్ విసురుతుంది.ఇటీవల సూరత్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అప్ అభ్యర్థికి మద్దతుగా పాల్గొనడం సంచలనంగా మారింది. దీంతో త్రిముఖ పోటీలో ఎవరి గెలుస్తారనే చెప్పడం కష్టంగా ఉందని అంటున్నారు పరిశీలకులు .అప్ తన సీఎం అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ సైతం ప్రకటించింది. భూపేంద్ర పటేల్ తన పదవిలో కొసాగుతారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు .
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు బీజేపీ అధినాయకుల్లో రెండో స్థానంలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి మంగళవారం ఈ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న భూపేంద్ర పటేలే తమ సీఎం అభ్యర్థి అన్న అర్థం వచ్చేలా అమిత్ షా మంగళవారం ఓ కీలక వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే… భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారు అంటూ అమిత్ షా ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తనకూ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలను అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వచ్చిన ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో… గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వస్తే… భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్రకు అనూహ్యంగా సీఎం పదవి దక్కింది. విజయ్ రూపానీ నుంచి ఆయన సీఎం కుర్చీని దక్కించుకున్నారు.