Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ…టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ నారాయణ!

ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ…
సమస్యల వలయంలో పాత్రికేయ వృత్తి.
టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ నారాయణ

పత్రికా స్వేచ్ఛ దేశవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటుందని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ అన్నారు జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆ సంఘం జిల్లా నగర కమిటీలు సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారిన పరిస్థితిలో పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల వృత్తి పెను సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు దేశంలో సుమారు 46 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు . అదేవిధంగా రెండు వేలకు పైగా జర్నలిస్టులు జైళ్లకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. సరైన జీతాలు లేవు ఉద్యోగ భద్రత లేదు. మరోవైపు దాడులు, ఇలా అనేక సమస్యల వలయంలో నేడు జర్నలిస్టు వృత్తి కత్తి మీద స్వాముల కొనసాగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, పత్రిక యాజమాన్యాల మారిన విధానాలతో పాత్రికేయులు అనివార్యంగా సుడిగుండంలోకి నెట్టబడుతున్నారని ఈదగలిగిన వారు మాత్రమే అందులోంచి బయటపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశ స్వాతంత్రానికి ముందే స్థాపించిన బెంగాల్ గెజిట్ పత్రిక నుంచి మొదలు తెలుగు నాట వెలువడిన గోల్కొండ ఆంధ్ర పత్రికల నాటి పరిస్థితులు ,నాటి నుంచి ఈ నాటి వరకు కొనసాగుతున్న మార్పుల పై రామ్ నారాయణ పలు అంశాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా సుమారు 4 నుంచి లక్షల మంది జర్నలిస్టు వృత్తిలో ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో నాన్ బెయిలబుల్ కేసులను జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఇన్ని వడిదొడుకుల మధ్య కూడా జర్నలిస్టులు తమ వృత్తిని కొనసాగించడం ప్రశంశనీయమని అన్నారు . ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశ్వసనీయత ప్రామాణికంగా జర్నలిస్టులు వార్తలు రాయాలని అటువంటి జర్నలిజమే దీర్ఘకాలం ఆదరణ పొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మారిన పరిస్థితుల్లో జర్నలిస్టులు కొందరు యాజమాన్యాల లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారని ఆ విషయంలో ఎవరికి వారే విమర్శకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రెస్ కౌన్సిల్ ఏర్పడిన నవంబర్ 16 ను జాతీయ పత్రికా దినోత్సవం గా జరుపుకుంటామని రామ్ నారాయణ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రెస్ కౌన్సిల్లో గతంలో పాత్రికేయులకు సభ్యులుగా ప్రాధాన్యత ఉండే దన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రెస్ కౌన్సిల్లో పాత్రికేయులకు స్థానం లేకుండా చేసిందని ఆయన పేర్కొన్నారు. మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేసి అందులో పాత్రికేయులకు ప్రాధాన్యత కల్పించాలని ఐజేయు డిమాండ్ చేస్తుందన్నారు. జర్నలిస్టులకు రైల్వే ఇచ్చే రాయితీని కూడా ఇటీవల ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. రైల్వే పాసులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు సత్వరమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని లేనిపక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆందోళనలు చేపడతామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు భవాని సింగ్ ,కట్టే కోల చిన్న నరసయ్యలను సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు ,రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకటరావు ,నగర అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు, ఉషోదయం శ్రీనివాస్ ,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాసరావు ,కనకం సైదులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాటేటి వేణుగోపాల్ ,జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్ ,నాయకులు నామా పురుషోత్తం, తదితరులు ప్రసంగించారు.

పూర్వ జర్నలిస్టు పుల్లయ్యకు జర్నలిస్టుల ఘన సన్మానం…

పూర్వ జర్నలిస్టు రిటైర్డ్ టీచర్ పుల్లయ్యను జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా, ఘనంగా సత్కరించారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయనను టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు ఏనుగు వెంకటేశ్వరరావు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ కనకం సైదులు నగర అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు ఉషోదయం శ్రీనివాస్ ఇతర జిల్లా నగర నాయకులు జర్నలిస్టు మిత్రులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు గతంలో పుల్లయ్య ఉదయం పత్రికలోను ఆ తర్వాత కొంతకాలం విశాలాంధ్ర పత్రికలోనూ జర్నలిస్టులుగా పని చేశారు ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

Related posts

రాహుల్ గాంధీపై అసోం సీఎం తీవ్ర వ్యాఖ్యలు… మండిపడిన సీఎం కేసీఆర్

Drukpadam

హైదరాబాద్ పబ్లిక్ స్కూలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam

సీనియర్ పాత్రికేయులు అమర్ నాథ్ అంత్యక్రియలు

Drukpadam

Leave a Comment