Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ లో రగులుతున్న రాజకీయం ….

టీఆర్ యస్ లో రగులుతున్న రాజకీయం ….
సత్తుపల్లి సభకు తుమ్మల పొంగులేటికి ఆహ్వానం సరిగా అందలేదా ?
వారు వస్తారా ? లేదా ?? అనే ఆసక్తి
అదేం లేదు అందరు వస్తారంటున్న జిల్లా అధ్యక్షులు మధు
తుమ్మలను పిలవడానికి కందాల అభ్యంతరం పెడుతున్నారా ??
పొంగులేటి ని వద్దని అంటున్నది ఎవరు ???
ఖమ్మం లో ఎంపీ నామ లంచ్ మీట్ లో పాల్గొనేది ఎవరు …

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో రాజకీయాలు రంజుగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే రగులుతున్నాయి. సత్తుపల్లి లో రాజ్యసభ సభ్యుల కృతజ్ఞత సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు . అంతవరకు బాగానే ఉన్న , ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తుమ్మల , మాజీ ఎంపీ పొంగులేటికి ఆహ్వానం ఉందా ? ఉంటె సరిగా ఉందా ?వారు హాజరవుతున్నారా ? లేదా ? అనే ఆసక్తి నెలకొన్నది. అయితే టీఆర్ యస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు మాత్రం బండి పార్థసారథి రెడ్డి , వెంకట వీరయ్యలు పిలిచే భాద్యత తుసుకున్నారని వారు అందరిని పిలిచారని అంటున్నారు . అందరు వస్తారని కూడా అన్నారు .

మరో 10 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు …వళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలనీ ,ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉండాలని ,ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ధి పథకాలు , , సంక్షేమ కార్యక్రమాలు గురించి వివరించాలని గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఆదేశాలు …కానీ జిల్లాలో పరిస్థితి వేరే విధంగా ఉంది…9 సంవత్సరాల కేసీఆర్ పాలన పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . అదే మునుగోడులో స్పష్టమైందని అంటున్నారు . అక్కడ గెలిచినప్పటికీ అది పెద్ద గెలుపు కాదనే అభిప్రాయాలూ టీఆర్ యస్ వర్గాల్లో సైతం ఉంది. ఈనేపథ్యం లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో శుక్రవారం టీఆర్ యస్ జాతర జరగబోతుంది. …ఖమ్మం జిల్లాలో నాయకులు ఎక్కువ నియోజకవర్గాలు తక్కువగా ఉండటం పార్టీలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా అందులో 7 ఎస్సీ ,ఎస్టీలకు రిజర్వుడ్ గా ఉన్నాయి. జనరల్ గా ఉన్న మూడు నియోజకవర్గాల ఒకటి మంత్రి నియోజకవర్గం పోగా మిగతా రెండు నియోజకవర్గాలకు ఒక్క టీఆర్ యస్ లోనే అరడజను మంది పోటీ పడుతున్నారు . ఇక లెఫ్ట్ తో పొత్తు ఉంటె పాలేరు , కొత్తగూడెం వారికీ ఇవ్వని తప్పని పరిస్థితి అంటున్నారు . రిజర్వుడ్ నియోజకవర్గాల్లో సైతం పోటీ తీవ్రంగా ఉంది. భద్రాచలం ,వైరా , నియోజకవర్గాలు కూడా లెఫ్ట్ పార్టీలకు కేటాయించే అవకాశం ఉంది.

రాజ్యసభ సభ్యులకు సత్తుపల్లి లో జరిగే కృతజ్ఞత సభకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , ఎంపీలు ,జిల్లా మంత్రి అజయ్ కి ఎంపీ నామకు ఆహ్వానాలు అందాయి. ఇందుకోసం శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వరంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

జిల్లా నుంచి చాల నెలల క్రితం రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారథిరెడ్డిలకు సన్మానం చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. వారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కొద్దీ రోజుల్లోనే ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన ఖమ్మంలో సన్మానం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మినహా తుమ్మలతో సహా అందరు హాజరైయ్యారు. భారీ జనసమీకరణ కూడా జరిగింది. తిరిగి సత్తుపల్లిలో జరగటం దీన్ని స్థానిక ఎమ్మెల్యే వెంకట వీరయ్య తన భుజాలమీద వేసుకోవడం ఆసక్తిగా మారింది. సత్తుపల్లి లో కార్యక్రమం అయినందున మాజీమంత్రి తుమ్మలను కార్యక్రమానికి పిలిచారా? లేదా ? అనే చర్చ జరుగుతుంది. ఆయన్ను పిలవద్దని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.ఇందులో నిజమెంత అనేది పక్కనపెడితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కొందరు పిలవద్దని అంటున్నారని వార్తలు వస్తున్నాయి. .జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాత్రం తుమ్మల , పొంగులేటి తో సహా అందరిని ఆహ్వానించారని అంటున్నారు . అయితే వారికీ ఆహ్వానాలు సరిగా అందలేదని తెలుస్తుంది. దీంతో వారు కూడా వెళ్లాలా లేదా అనే సందిగ్ధం లో పడ్డారని తెలుస్తుంది….ఏమి జరుగుతుందో చూద్దాం …

Related posts

ఖమ్మం టీఆర్ యస్ లో లుకలుకలు…

Drukpadam

హిమాచల్ లో కాంగ్రెస్ కు కొత్త చిక్కులు …

Drukpadam

తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు…లోక్ సభ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకుల నియామకం.. !

Drukpadam

Leave a Comment