Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలుక్రీడా వార్తలు

క్రికెట్ ఒక వినోదం …. ఐపీఎల్ ఒక మంచి వేదిక రికీ పాంటింగ్!

క్రికెట్ ఒక వినోదం …. ఐపీఎల్ ఒక మంచి వేదిక రికీ పాంటింగ్
-ఆటగాళ్లు భయపడాలిసిన పనిలేదు
-ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆందోళనపై రికీ పాంటింగ్ స్పందన
-భారత్ లో అమాంతం పెరిగిపోతున్న కరోనా కేసులు
-ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన
-ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రికీ పాంటింగ్

Players should not worry about Corona says Ricky Ponting

ఐపీల్ లో ఆడటంపై పలువురు క్రికెటర్లు ఆందోళన చెందుతున్న వేళ ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ సారధి రిక్కీ పాంటింగ్ స్పందించారు. క్రికెట్ ఒక వినోదం…. ఇది ఒక ఔషధమే లాంటిదే కొందరు ఆడుతుంటే అనేక మంది చూస్తుంటారు . కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు స్టేడియం కు వచ్చి చేసే ఆవకాశం లేకుండా పోయింది . ప్రేక్షకులు లేకుండానే ఐపిఎల్ జరుగుతుంది . లైవ్ ప్రోగ్రాం ఉన్నందున ప్రేక్షకులు ఇళ్ల వద్దనే కూర్చొని చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు. దీనివల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. అందువల్ల అట ఆడే ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు . బబుల్ లో ఉండటం ఒకటే ఇబ్బంది . దాన్ని అలవర్చుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉంది .వారు ఇబ్బందులను అర్థం చేసుకోగలం . వారిని తప్పుపట్టాల్సిన అవసరంలేదు అని పాంటింగ్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల నిర్వాహకులు ఆటగాళ్ల క్షేమం కోరి తీసుకున్న చర్యల్లో భాగం దీనివల్ల మంచే జరుగుతుంది అందువల్ల ఆందోళన పడాల్సిన పనిలేదు . బబుల్ లో ఉండే ఆటగాళ్లు కన్నా బయట ఉన్న ఆటగాల్లెకే రిస్క్ ఎక్కువ అని పాంటింగ్ అభిప్రాయపడ్డారు . ఇప్పటికే కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ టీంల నుంచి వైదొలిగి స్వదేశాలకు బయలుదేరారు . అయితే ఆయాదేశాలు ఇండియా కు విమాన సర్వీసులను నిలిపివేయడంతో ఇండియా లోనే ఉండి పోయారు. బీసీసీఐ కూడా ఐపీల్ నుంచి వెళ్లే వాళ్ళు వెళ్ళ వచ్చు వారి నిర్ణయాన్ని స్వాగతిస్తాం అని స్పష్టం చేసింది . దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లీన్ తాము తిరిగి ఆస్ట్రేలియా వెళ్లేందుకు విమానం ఏర్పాటు చేయాలనీ ఆ దేశ క్రికెట్ బోర్డు ను కోరాడు . ఆయన తో పాటు మరి కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్లు మంబై లో తమ దేశం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రాబోతోందనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. భారత్ నుంచి విమాన రాకపోకలను తమ దేశాలు రద్దు చేయడంతో వారి ఆందోళన మరింత పెరుగుతోంది. తిరిగి స్వదేశానికి ఎలా చేరుకోవాలా అనే ఆందోళనలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా కూడా నిన్న భారత విమానాలపై నిషేధం విధించింది. వచ్చే నెల 15 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు. ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు స్వదేశానికి రావాలంటే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి . ఆసీస్ ఆటగాళ్లు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మైదానం వెలపల ఉన్న పరిస్థితులతో పోల్చితే, బబుల్ లో ఉండే ఆటగాళ్ల ఇబ్బంది చాలా చిన్న విషయమని తెలిపారు. తిరిగి వెళ్లడం అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుత దారుణ పరిస్థితుల్లో ఐపీఎల్ ఎంతో మందికి వినోదం కలిగిస్తోందని తెలిపారు.

Related posts

త్వరలోనే తోకముడవనున్న ఒమిక్రాన్: ఆంటోనీ ఫౌచి!

Drukpadam

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ దన్ను…

Drukpadam

వెస్టిండీస్ పై మొదటి టెస్ట్ లో ఇండియా గ్రాండ్ విక్టరీ …!

Drukpadam

Leave a Comment