Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి ఫరూక్ అబ్దుల్లా రాజీనామా!

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి ఫరూక్ అబ్దుల్లా రాజీనామా!

  • వయసు పెరుగుతోందన్న ఫరూక్ అబ్దుల్లా
  • డిసెంబర్ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక
  • ఒమర్ అబ్దుల్లా చీఫ్ గా బాధ్యతలను చేపట్టే అవకాశం

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శ్రీనగర్ లో తన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. వయసు పెరుగుతోందని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పార్టీని నడిపించే శక్తి ప్రస్తుతం తన శరీరానికి లేదని ఆయన చెప్పారు.

ఈ క్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ నూతన అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా కుమారుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బాధ్యతలను చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఒమర్ అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అప్పటి వరకు ఫరూక్ అబ్దుల్లానే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

మరోవైపు ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ… పార్టీని బలోపేతం చేసేందుకు నేతలందరూ కష్టపడాలని కోరారు. స్థానికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని… పార్టీ నాయకులు వారికి అండగా ఉండాలని, వారితో కలిసి పని చేయాలని చెప్పారు. పార్టీ నాయకత్వాన్ని కొత్త తరం చేపట్టాల్సిన సమయం ఆసన్నమయిందని అన్నారు.

Related posts

పవన్ కల్యాణ్ హత్యాయత్నానికి పాల్పడ్డారు…భూమన

Drukpadam

కులాల వారీగా జనాభా లెక్కించండి: ప్రధాని మోదీని కోరిన నితీశ్!

Drukpadam

ఏపీ మంత్రి సిదిర అప్పలరాజు కు సీఎం పర్యటనలో అవమానం!

Drukpadam

Leave a Comment