Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ లో చేరడమా అబ్బె లేదు నిన్న …నాతోపాటు మరికొందరు బీజేపీలో చేరుతున్నారు నేడు …మర్రి శశిధర్ రెడ్డి …

పార్టీ మార్పుపై మరింత స్పష్టత నిచ్చిన మర్రి శశిధర్ రెడ్డి!

  • పార్టీ మారుతున్నట్టు శశిధర్ రెడ్డిపై కథనాలు
  • బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు
  • ఢిల్లీలో అమిత్ షాను కలిసిన శశిధర్ రెడ్డి
  • తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ ను వీడుతున్నారన్న సీనియర్ నేత

బీజేపీ లోఆబ్బె లేదు నిన్న …నాతోపాటు మరికొందరు బీజేపీలో చేరుతున్నారు నేడు …మర్రి శశిధర్ రెడ్డి …

ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే అనేది నిన్నటి మాట …రాజకీయ నాయకుల మాటలకూ అర్థాలు వేరు అనేది నేటి మాట నిన్నగాక మొన్న కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి చెప్పినమాటలు …నేడు నాతోపాటు మరికొందరు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పడం కొసమెరుపు …అంతే కాదు కాంగ్రెస్ పై నాయకత్వంపై విమర్శలు … రాత్రి అమిత్ షాతో భేటీ …ఈయనతోపాటు టీఆర్ యస్ కు చెందిన పుట్టమధు చేరుతున్నట్లు ప్రచారం ..ఏదైనా కాంగ్రెస్ నాయకులూ ఒక్కక్కరుగా పార్టీని వీడుతున్న అధిష్టానం పట్టించుకోకపోవడం విచారక కారమనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ మారుతున్నాడంటూ కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కనిపించడంలేదని అన్నారు. అందుకే ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని వెల్లడించారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బయటికి వస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదని, మునుగోడు ఉప ఎన్నికను ఎంతో తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అందుకు రేవంత్ దే బాధ్యత అని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను చెంచాగాళ్లతో నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.

మర్రి శశిధర్ రెడ్డి… బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లతో కలిసి నిన్న ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. శశిధర్ రెడ్డి పార్టీలోకి వచ్చేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related posts

కృష్ణా కరకట్ట మీద ఉన్నది చంద్రబాబు ఇల్లు కాదు మిస్టర్ సజ్జల …వర్ల …

Drukpadam

జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత …ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు :చంద్రబాబు

Drukpadam

నాకు జెడ్ కేటగిరీ భద్రత వద్దు… అసదుద్దీన్ ఒవైసీ!

Drukpadam

Leave a Comment