Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ…

కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ…
-శశిధర్ రెడ్డిని బహిష్కరించిన క్రమచక్షణ కమిటీ చైర్మెన్ చిన్నారెడ్డి
-పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వేటు
-బీజేపీలో చేరబోతున్న శశిధర్ రెడ్డి

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ,బీజేపీలో తాను చేరుతున్నట్లు ప్రకటించిన మర్రి శశిధర్ రెడ్డిని పార్టీని బహిష్కరించారు .గత వారంరోజులుగా ఆయన పార్టీ మారుతున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లు ఎత్తుతున్నాయి.దీనిపై ఆయన తాను పార్టీ మారటం లేదంటూ ప్రకటించారు. కొందరు కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా పార్టీ మారడంలేదంటూ చేసిన ప్రకటన నమ్మారు. కానీ మరో పొద్దునే ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలవడం బీజేపీ లో చేరుతున్నట్లు ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది.

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెన్షన్ వేటు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నిన్ని శశిధర్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు కొంత కాలంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై శశిధర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధ పడుతోందని, ఆ క్యాన్సర్ ఇప్పట్లో నయమయ్యే అవకాశం లేదని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని… తనతో పాటు మరి కొందరు కాంగ్రెస్ నేతలు బయటకు వస్తున్నట్టు తెలిపారు.

Related posts

ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుపై రషీద్ ఖాన్ అలక… కెప్టెన్సీకి గుడ్ బై!

Drukpadam

బీఆర్ఎస్ పెట్టుకోండి… వీఆర్ఎస్ తీసుకోండి: ర‌ఘునంద‌న్ రావు!

Drukpadam

కేసీఆర్ బీఆర్ యస్ పెట్టడంలో కుట్రకోణం దాగిఉంది…పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment