కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్!
- సీఈసీగా అరుణ్ గోయల్ నియామకం
- కేంద్రం ఉత్తర్వులు
- రాష్ట్రపతి ఆమోదం
- గోయల్ 1985 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
కేంద్ర ఎన్నికల సంఘం కొత్త అధికారిగా అరుణ్ గోయల్ ను నియమించారు.ప్రస్తుతం రాజీవ్ కుమార్ ఎన్నికల సంఘం అధికారిగా వ్యవహరిస్తున్నారు .ఆయన రెండు నెలల క్రితమే ఎన్నికల సంఘం అధికారిగా భాద్యతలు స్వీకరించారు . ఎన్నికల సంఘం ప్యానల్ లో మరో సభ్యుడుగా అరుణ్ గోయల్ నియామకంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఆయన వెంటనే భాద్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ గా అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా రాజీవ్ కుమార్ వ్యవహరించారు. ఆయన గత మే నెలలోనే సీఈసీ పదవీ బాధ్యతల్లోకి వచ్చారు.