Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం లో పోలీస్ స్వామ్యం…సీఎల్పీ నేత భట్టి

ఖమ్మం లో పోలీస్ స్వామ్యం
-స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు
-కాంగ్రెస్ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు.
-మీకెందుకురా కాంగ్రెస్ అంటూ పోలీసులు భూతులు తిడుతున్నారు
– ఎన్నికల కార్యాలయాల్లోకి పోలిసుల ప్రవేశించి భయానకం సృష్టిస్తున్నారు
-మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాల ప్రకారం పోలీసులు నడుచుకోవడం అప్రజాస్వామికం
-టీఆర్ యస్ ప్రలోభాలకు పట్టించుకోవడం లేదు
– కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సీఎల్పీ నేత భట్టి


రేపు ఖమ్మం నగరంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగడం లేదని పోలీస్ స్వామ్యంలో జరుగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోలిసుల తీరును తప్పు పట్టారు . పోలీసులు మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ కర్ణన్ కలిసిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఏ ఎన్నికైన ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలి .కానీ ఖమ్మం లో జరుగుతున్నా ఎన్నిక అందుకు విరుద్ధంగా జరుగుతుంది . మొదటి నుంచి అధికార టీఆర్ యస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలపై అనేక నిర్బంధాలు , బెదిరింపులు ,కేసులు ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసి నిర్బంధ కాండ కొనసాగించడం పై మండిపడ్డారు . 58 డివిజన్లో కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంపై పోలీసులు దాడి చేసి కార్యకర్తలను భయపెట్టడాన్ని గర్హించారు . డివిజన్ కు చెందిన శెట్టి రంగారావు ను అరెస్ట్ చేయడం, పోలిస్ స్టేషన్ కు తరలించి దేశ ద్రోహులను, దొంగలను హాజరు పరిచినట్టు తెల్లవారుజామున 3 గంటలకుమేజిస్ట్రేట్ ముందు హాజరు పరచడంపై ఆయన మండి పడ్డారు. అదే విధంగా 29 డివిజన్లో పోటీలో ఉన్న కార్పొరేటర్ భర్తను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని ఇలాంటి చర్యలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రి పువ్వాడ అధికార దుర్నియోగానికి పాల్పడుతున్నారని ఇది తన అభిప్రాయమే కాకుండా ప్రజాస్వామ్య వాదుల అభిప్రాయమని అన్నారు. ఎన్నికల నియమాలను అధికార పార్టీ ఉల్లంఘిస్తే లేని అభ్యంతరం తమ కార్యకర్తలు బయటకు వెళ్లినా నిర్బంధకాండ కొనసాగించటం పై భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తీ ప్రజాస్వామ్య పద్దతిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకెందుకురా అంటూ భూతులు తిట్టినా అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ,ఎన్నికల అధికారిగా ఉన్న కర్ణన్ కు ఎన్నికల్లో జరుగుతున్నా అప్రజాస్వామిక విధానాలను వివరించటం జరిగిందన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షలు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు , నగర అధ్యక్షుడు జావేద్ , తదితరులు ఉన్నారు.

Related posts

మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను విడిపించుకునేందుకు.. మహిళ సాహసం!

Drukpadam

ఎర్ర చీమల దెబ్బకు ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు..

Drukpadam

Drukpadam

Leave a Comment