Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో బీజేపీదే అధికారం …అమిత్ షా విశ్వాసం …

తెలంగాణ ప్రజల నాడి నాకు తెలుసు.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం: అమిత్ షా!
-తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న అమిత్ షా
-బీజేపీ సౌత్ ఎంట్రీకి తెలంగాణ గేట్ వే వంటిదని వ్యాఖ్య
-మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని ధీమా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ భారీ ఆధిక్యంలో అధికారంలోకి రాబోతుందని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు . కేంద్రంలో కూడా బీజేపీదే అధికార …తిరిగి నరేంద్రమోడీనే ప్రధాని అని అమిత్ షా ప్రకటించడం విశేషం … బీజేపీ ప్రధాని పదవి రెండుసార్లకు మించి చేయకూడదనే నియమం ఉండనే నిర్ణయానికి ఇది భిన్నమని అంటున్నారు విమర్శలకు …ఆయన వయస్సు కూడా 70 సంవత్సరాలు దాటుతుందని అందువల్ల వయస్సు పైబడిన మోడీ ఎలా పదవి స్వీకరిస్తారని అంటున్నారు . దీనిపై బీజేపీనే సమాధానం చెప్పాల్సి ఉంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . భారీ మెజార్టీతో తెలంగాణలో విజయాన్ని కైవసం చేసుకోబోతున్నామని చెప్పటం అతివిశ్వాసమేనని అంటున్నారు రాజకీయ పండితులు . తెలంగాణ ప్రజల నాడి తనకు తెలుసని… రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని అన్నారు.

ఎన్నికలకు ముందు తాను తెలంగాణకు వెళ్తానని… బీజేపీని గెలిపించుకుంటామని చెప్పారు. బీజేపీ సౌత్ ఎంట్రీకి తెలంగాణ గేట్ వే వంటిదని అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది కూడా ఎన్డీయే ప్రభుత్వమేనని.. మోదీ మరోసారి ప్రధాని పదవిని చేపట్టబోతున్నారని అన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్ 2022లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

బీజేపీ కి చావుడప్పు కొట్టడంపై బండి సంజయ్ మండిపాటు1

Drukpadam

అవినీతిపరుల కూటమికి కన్వీనర్ మీరేనా? అంటూ మోదీపై ఖర్గే తీవ్ర విమర్శలు

Drukpadam

అసెంబ్లీ లో ఫ్రెండ్లీ పార్టీల మధ్య మాటల యుద్ధం …

Drukpadam

Leave a Comment